టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ ఇచ్చిన సలహా బెడిసికొట్టింది. ఫలితంగా.. వికెట్ తీయాలనుకున్న వాషీకి.. బ్యాటర్ బౌండరీ బాది షాకిచ్చాడు. దీంతో మాట మార్చిన పంత్.. తనదేమీ తప్పులేదన్నట్లుగా సమర్థించుకోవడంతో వాషీ బిక్కముఖం వేశాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే..!
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయగా.. రోహిత్ సేన బౌలింగ్‌కు దిగింది.
ఈ క్రమంలో రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు చెన్నై బౌలర్లు కలిసి కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. గురువారం నాటి తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ వాషీ వేశాడు.
పంత్ సలహాను పాటించిన వాషీ
అప్పుడు.. న్యూజిలాండ్ టెయిలెండర్ అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో అతడి కాళ్ల ముందు కాస్త ఎడంగా బాల్ వేయాలని వికెట్ కీపర్ రిషభ్ పంత్ వాషింగ్టన్‌కు సూచించాడు. అందుకు సానుకూలంగా స్పందించిన వాషీ.. పంత్ సలహాను పాటించాడు.
PC: Jio Cinema X
ఫోర్ కొట్టిన అజాజ్ పటేల్
అయితే, వీరి సంభాషణను అర్థం చేసుకున్న అజాజ్ పటేల్ కాస్త ముందుకు వచ్చి ఆడి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో వాషీ నిరాశకు గురికాగా.. పంత్ మాత్రం.. ‘‘అతడికి హిందీ వచ్చని నాకేం తెలుసు?’’ అంటూ తన సలహాను సమర్థించుకున్నాడు.
ఇక పంత్ కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. కాగా భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్ ముంబైలో జన్మించాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు అజాజ్ కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లింది. మరి పంత్ హిందీలో వాషీతో మాట్లాడుతుంటే అజాజ్ పటేల్‌కు అర్థం కాకుండా ఉంటుందా?! అదీ సంగతి!
156 పరుగులకే ఆలౌట్
కాగా శుక్రవారం 16-1తో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా 156 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టాడు.
చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్ చాంపియన్
In today's episode of 𝘒𝘦𝘦𝘱𝘪𝘯𝘨 𝘸𝘪𝘵𝘩 𝘙𝘪𝘴𝘩𝘢𝘣𝘩 𝘗𝘢𝘯𝘵! 👀😂#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #TeamIndia pic.twitter.com/LoUC31wADr
— JioCinema (@JioCinema) October 24, 2024
Comments
Please login to add a commentAdd a comment