Asia Cup- ICC ODI World Cup 2023: ‘‘వాషింగ్టన్ సుందర్.. అతడి పేరునే పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా కప్ జట్టులో అతడికి చోటు ఇవ్వలేదు. నిజానికి జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి సుందర్ గురించి చర్చ జరగడం సబబే. జట్టులో ఒకటీ అరా మార్పులు ఉండవచ్చు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.
యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించవచ్చని జోస్యం చెప్పాడు. ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉన్న వేళ మెగా ఈవెంట్ సమయానికి సుందర్‌కు పిలుపు రావొచ్చని అభిప్రాయపడ్డాడు.
వరల్డ్‌కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం.. ఎందుకంటే
ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్లను ఎదుర్కొనేందుకు టీమిండియాకు తప్పక ఆఫ్ స్పిన్నర్ల అవసరం ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా 2017లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తమిళనాడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్.
రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన వాషీ.. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 4 టెస్టులు(6 వికెట్లు), 16 వన్డేలు(16 వికెట్లు), 37 టీ20 మ్యాచ్‌లు(29 వికెట్లు) ఆడాడు. బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో రాణించడం అతడికి ఉన్న అదనపు అర్హత.
వాళ్లంతా ఆసియా కప్ జట్టులో
అయితే, ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్‌కు ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. 17 మంది సభ్యుల జట్టులో స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు.
రోహిత్ శర్మ చెప్పాడు కదా!
ఇక ఆసియా కప్ జాబితా నుంచే వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్‌లకు దారులు మూసుకుపోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడం అతడికి ఉన్న ప్లస్ పాయింట్.
ఒకవేళ సుందర్ గనుక మెగా ఈవెంట్‌కు ముందు ఆడే మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకుంటే తప్పక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న టెంప్టింగ్ ఆప్షన్ తనే’’ అని పేర్కొన్నాడు.
ఐర్లాండ్ పర్యటనలో
కాగా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. డబ్లిన్‌లో బుధవారం జరిగే ఆఖరి టీ20లో గనుక సత్తా చాటితేనే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకుని మెరుగ్గా రాణిస్తేనే సుందర్ వరల్డ్‌కప్ ఆశలు సజీవంగా ఉంటాయి.
చదవండి: హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్‌లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి..
కోహ్లి తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. అతడి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ
Comments
Please login to add a commentAdd a comment