ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌తో వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. కాకపోతే చెప్పండి.. వన్డే సిరీస్‌లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు వన్డేల సిరీస్‌లో సుందర్ బ్యాటింగ్‌లో 67 పరుగులు.. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా మూడో వన్డేలో 33 పరుగులు చేసిన సుందర్.. దీపక్ చహర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. సూపర్ రీ ఎంట్రీ మనం అనుకునే లోపు సుందర్ మరోసారి గాయం బారిన పడ్డాడు.
చదవండి: Keegan Petersen: టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా
విషయంలోకి వెళితే.. కండరాల గాయంతో సుందర్‌వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడమకాలు కండరాల గాయంతో బాధపడ్డాడు. రిపోర్ట్స్‌లో గాయం తీవ్రత గ్రేడ్-1 గా తేలడంతో సుందర్ టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరి 15(మంగళవారం) సుందర్ ఎన్‌సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. మూడువారాల పాటు సుందర్ రీహాబిటేషన్‌లో ఉండనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా సుందర్ స్థానంలో లెగ్‌స్పన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఇప్పటికే గాయంతో కేఎల్ రాహుల్, రీహాబిటేషన్ పేరుతో అక్షర్ పటేల్‌లు టి20 సిరీస్‌కు దూరమవ్వగా.. తాజాగా సుందర్ కూడా ఆ జాబితాలో చేరాడు. కాగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ స్థానాల్లో దీపక్ హుడా, రుతురాజ్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 16,18,20వ తేదీల్లో విండీస్‌తో టీమిండియా మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఐపీఎల్ మెగావేలంలో వాష్టింగ్టన్ సుందర్‌ను రూ. 8.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND vs WI: విరాట్ కోహ్లిని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా!
విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా
Comments
Please login to add a commentAdd a comment