IND vs WI: KL Rahul and Axar Patel Ruled Out of T20 Series - Sakshi
Sakshi News home page

IND vs WI: టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. కీలక ఆటగాళ్లు దూరం

Published Fri, Feb 11 2022 6:49 PM | Last Updated on Fri, Feb 11 2022 7:18 PM

KL Rahul-Axar Patel Ruled Out T20I Series Against West Indies - Sakshi

వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌లు టి20 సిరీస్‌కు దూరమయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ హుడాలను జట్టులోకి ఎంపికచేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా టీమిండియా వైస్‌కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విండీస్‌తో రెండోవన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఎడమకాలు కండరాల నొప్పితో మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో టి20 సిరీస్‌కు రాహుల్‌ దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.

ఇక వన్డే సిరీస్‌ ఆరంభానికి అక్షర్‌ పటేల్‌, ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు కోవిడ్‌ నుంచి  కోలుకున్నప్పటికి అక్షర్‌ పటేల్‌ ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకోవడం కోసం రిహాబిటేషన్‌ పేరుతో సిరీస్‌కు దూరంగా ఉంచినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ ఇద్దరు బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది.

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత​ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యజ్వేంద్ర చహల్, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement