
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన చర్యతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అసలేం జరిగిందంటే?
శ్రీలంక ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసేందుకు భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఎటాక్‌లో వచ్చాడు. అయితే తొలి బంతిని డెలివరీ చేసే క్రమంలో వాషింగ్టన్ తన రన్‌ఆప్‌ను కోల్పోయి వికెట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఇది చూసి నవ్వుకున్నాడు.
కాగా రెండో సారి కూడా సుందర్ బంతిని డెలివరీ చేసే క్రమంలో వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అయితే ఈసారి మాత్రం హిట్‌మ్యాన్ తనదైన స్టైల్లో స్పందించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. వాషింగ్టన్ సుందర్‌ను కొట్టేందుకు పరిగెత్తుకుంటా ముందుకు వచ్చాడు.
నిన్ను కొట్టేస్తా అన్నట్లు సరదగా రోహిత్ సైగలు చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. దీంతో వాషీతో పాటు సహచర ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
Rohit Sharma is a complete entertainer in the field. 💥👌 pic.twitter.com/cqjlkFxGP3
— Johns. (@CricCrazyJohns) August 4, 2024