ఐపీఎల్-2025 మెగా వేలానికి సర్వం సిద్దమైంది. నవంబర్ 24-25 తేదీలలో జెడ్డా వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ మెగా వేలంలో అందరి కళ్లు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పైనే ఉన్నాయి. అద్బుత ఫామ్‌లో ఉన్న సుందర్ ఎంత ధరకు అమ్ముడు పోతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో వాషింగ్టన్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. కాగా మెగా వేలంలో వాషింగ్టన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. శ్విన్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేసిన ఈ మాక్ వేలంలో సుందర్ కోసం తొలుత ఆర్సీబీ రూ. 2 కోట్లకు బిడ్ వేసింది.
ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. ఎస్ఆర్‌హెచ్ క్రమక్రమంగా వాషింగ్టన్ ధరను రూ. 8 కోట్లకు పెంచింది. దీంతో ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకొని గుజరాత్ జెయింట్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి గుజరాత్ జెయింట్స్ సుందర్ కోసం ఏకంగా రూ. 15.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. కాగా సుందర్ గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మెగా వేలానికి ముందు అతడిని ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు.
న్యూజిలాండ్‌పై అదుర్స్..
కాగా ఐపీఎల్-2024లో సుందర్ నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కానీ టీఎన్‌పీఎల్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సుందర్ దుమ్ములేపాడు. ఆ తర్వాత అనుహ్యంగా భారత టెస్టు జట్టులోకి వచ్చిన వాషింగ్టన్.. న్యూజిలాండ్‌పై సంచలన ప్రదర్శన కనబరిచాడు. కేవలం రెండు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే సుందర్‌కు ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర దక్కనుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. తెలుగోడి అరంగేట్రం ఫిక్స్!?
Comments
Please login to add a commentAdd a comment