Washington Sundar Tests Positive for Covid-19 - Sakshi
Sakshi News home page

Washington Sundar: టీమిండియాకు భారీ షాక్‌.. వన్డే జట్టు సభ్యుడికి కరోనా 

Published Tue, Jan 11 2022 4:19 PM | Last Updated on Tue, Jan 11 2022 6:37 PM

Washington Sundar Tests Positive For Covid - Sakshi

Washington Sunder Tested Covid Positive: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు సభ్యుడు వాషింగ్టన్‌ సుందర్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌ కోసం భారత వన్డే జట్టు రేపు కేప్‌టౌన్‌ విమానం ఎక్కాల్సి ఉండగా సుందర్‌ కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. 

గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సుందర్‌.. ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీలో రాణించి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా జనవరి 19న తొలి వన్డే, 21న రెండోది, జనవరి 23న మూడో వన్డే ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ సారధిగా వ్యవహరించనున్నాడు.  
చదవండి: ఐపీఎల్ 2022లో కీలక మార్పు.. టైటిల్ స్పాన్సర్‌ షిప్‌ నుంచి తప్పుకున్న వివో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement