ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు తరలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా రషీద్ ఖాన్ పెద్ద టేకర్ ఏమీ కాదని, అతనికి మించిన బౌలర్లు ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశాడు. రషీద్ ఖాన్ లేకున్నా తాము మ్యాచ్‌లు గెలుస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించాడు.
ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్‌తో లారా మాట్లాడుతూ.. రషీద్ ఖాన్‌పై తనకు చాలా గౌరవం ఉందని, ప్రస్తుతం అతను తమతో లేకున్నా పెద్ద నష్టమేమీ లేదని అన్నాడు. రషీద్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ ఆడాలనుకుంటారని, అదే వారు వికెట్ సమర్పించుకునేలా చేస్తుందని, ఇందులో రషీద్ ఖాన్ గొప్పేమీ లేదని పేర్కొన్నాడు. అయితే, రషీద్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడని, టీ20ల్లో ఓవర్‌కు 5-6 పరుగులు మాత్రమే ఇవ్వడం చాలా గొప్ప విషయమని కితాబునిచ్చాడు.
ఇదిలా ఉంటే, 2017 నుంచి 2021 సీజన్ వరకు రషీద్ సన్‌రైజర్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. రకరకాల కారణాల చేత ఆరెంజ్ ఆర్మీ అతన్ని ఈ ఏడాది తిరిగి దక్కించుకోలేకపోయింది. ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా రషీద్ ఐపీఎల్ 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. డ్వేన్ బ్రావో (179), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (149) తర్వాత 100 వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా రషీద్ రికార్డుల్లోకెక్కాడు.
చదవండి: భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment