హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపు దగ్గరగా వచ్చి పరాజయం చెందడాన్ని జీర్ణించుకోవడం చాలా కఠినంగా ఉందన్నాడు. ఈ క‍్రమంలోనే తమ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్.. కనీసం పోరాడే స్కోరును ఉంచలేకపోయామన్నాడు.
‘వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మమ్మల్ని గెలుపు ఊరించినట్లే ఊరించి దూరమైంది. ఇది చాలా నిరాశపరిచింది. మేము మంచి స్కోరు సాధించలేకపోయాం. దాంతోనే పోరాడి ఓడిపోయాం. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేది. మా బ్యాట్స్‌మెన్ ఇంకా బాగా ఆడాల్సింది. బ్యాట్స్‌మెన్ వైఫల‍్యమే మా కొంప ముంచింది. ఇక బౌలర్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. సాధారణ స్కోరును కూడా రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో గేమ్‌ను మా చేతుల్లోకి తీసుకొచ్చారు. కానీ అదృష్టం కలిసిరాలేదు. చివరి వరకూ పోరాడినా ఓటమితోనే సరిపెట్టుకోవాల్సి వచ‍్చింది. పరాజయం బాధించినా.. యువ క్రికెటర్లు ఆకట్టుకున్న తీరు బాగుంది’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతికి సన్‌రైజర్స్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. దాంతో సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోగా, ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐపీఎల్ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నైపై ముంబై పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment