ముంబై ప్లే ఆఫ్‌ చేరేనా? | Delhi Won The Toss And Choose To Bat | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 3:46 PM | Last Updated on Sun, May 20 2018 5:17 PM

Delhi Won The Toss And Choose To Bat - Sakshi

రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11 సీజన్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు ఫిరోజ్‌-షా కోట్ల మైదానం వేదికైంది. ఢిల్లీడేర్‌డెవిల్స్‌ తో జరుగుతున్న చావోరేవో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లలో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముంబై జట్టులో మెక్లిగన్‌ స్థానంలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ రాగా.. ఢిల్లీ జట్టులో అవేశ్‌ఖాన్‌ స్థానంలో​ ప్లంకెట్‌ తుది జట్టులోకి వచ్చాడు.

గెలిస్తేనే.. ప్లే ఆఫ్‌
ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. గెలిస్తే ప్లే ఆఫ్‌.. లేకుంటే ఇంటికి వెళ్తోంది. ఇక ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై అనూహ్య విజయం అందుకుని ఆశ్చర్యపరిచింది. ఈ విషయమే ముంబై ఇండియన్స్‌ను కలవర పరుస్తోంది. 13 మ్యాచుల్లో 6 మాత్రమే నెగ్గి ఆరో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్‌ ఎలాగైన గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ముంబైకే ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలున్నాయి. ఆ జట్టు రన్‌రేట్‌ రాజస్తాన్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల కన్నా మెరుగ్గా ఉంది. ఓడితే మాత్రం రాజస్తాన్‌, పంజాబ్‌(చెన్నైతో గెలిస్తే) జట్లలో ఓ జట్టుకు ప్లేఆఫ్‌ అవకాశం ఉంటుంది.

తుదిజట్లు
ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌, ఇషాన్‌ కిషాన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, బెన్‌ కట్టింగ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌‌, మయాంక్‌ మార్కండే, జస్ప్రిత్‌ బుమ్రా

ఢిల్లీ: పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌),  రిషబ్‌ పంత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, హర్షపటేల్‌, అమిత్‌ మిశ్రా, లియామ్‌ ప్లంకెట్, సందీప్‌ లామిచ్చేన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement