ఐపీఎల్ 2018 లీగ్ దశ ముగిసిపోయింది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. ప్లేఆఫ్స్ చేరాలనే గంపెడంతా ఆశతో ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడింది. కానీ ఇటు ముంబై, అటు పంజాబ్ ఓడిపోవడంతో ఆ రెండు జట్లు ఇంటిదారి పట్టాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది.
ఢిల్లీ జట్టు పోతూపోతూ.. ముంబై జట్టును కూడా ఇంటి దారిపట్టించింది. చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ముంబై 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక.. 11 పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ముంబై జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇక, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరు మరీ దారుణమని చెప్పాలి. రోహిత్ శర్మ ఇప్పటివరకు 11 ఐపీఎల్ సిరీస్‌లు ఆడగా.. అందులో పది సీజన్‌లలోనూ 300కుపైగా పరుగులు చేశాడు. తాజా పదకొండో సీజన్‌లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు.
ఆదివారం వరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగులకుపైగా చేసిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, సురేశ్ రైనా పేరిట రికార్డు ఉండేది. ఆదివారం మ్యాచ్‌లో కూడా రోహిత్ (13 పరుగులు మాత్రమే చేశాడు) అంతగా రాణించకపోవడంతో అతను 300 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. మరోవైపు చెన్నై తరఫున ఆడుతున్న రైనా.. ఇప్పటికే 300లకుపైగా పరుగులు చేశాడు. దీంతో మొత్తం 11 ఐపీఎల్ సీజన్‌లలోనూ 300 పరుగులకుపైగా చేసిన ఏకైక ఆటగాడిగా నిలువగా.. రోహిత్ ఆ రికార్డును అందుకోలేకపోయాడు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్‌లో 300 మార్కును అందుకోలేకపోయిన ఆటగాడిగా చెత్త రికార్డును కూడా రోహిత్ మూటగట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment