Delhi Daredavils
-
‘మ్యాక్స్‌వెల్ వైఫల్యానికి రిషబ్ పంతే కారణం’
సాక్షి, న్యూఢిల్లీ : టీ20 అంటేనే ధనాధన్ ఆట..ప్రేక్షకులకు అత్యంత వినోదాన్ని అందించడమే టీ20 క్రికెట్ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలోనే బ్యాట్‌కు బంతికి ఆసక్తికర పోరు జరుగుతూ ఉంటుంది. మ్యాచ్ ప్రత్యర్థి చేతిలో ఉన్నా.. ఒక్కసారిగా గేర్ మార్చి విధ్వంసం సృష్టించాలి. ఇలాంటి ఆటకు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పెట్టింది పేరు. ఈ ఆటగాడికి ఐపీఎల్ అనుభవం ఉండడంతో ఈ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ ఏం లాభం కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోయిన మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యాడు. దీనికి తోడు మిగతా ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంలో విఫలమవ్వడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టు మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శనపై ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ తోటి క్రికెటర్‌ను వెనుకేసుకొచ్చాడు. ఐపీఎల్‌కు ముందు జరిగిన సిరీస్‌లోనూ మ్యాక్స్ అద్భుతంగా ఆడాడని, ఐపీఎల్‌లోనే బాగా ఆడలేకపోయాడని, అతను రెగ్యులర్‌గా ఆడే నాలుగో స్థానంలో పంత్ ఆడటంతో, బ్యాటింగ్ స్థానాలు పదేపదే మార్చాల్సివచ్చిందన్నారు. దాంతో మ్యాక్స్‌వెల్ సరిగా ఆడలేకపోయాడని తెలిపాడు. ముందుగా అనుకున్న ప్రకారం మ్యాక్స్ నాలుగో స్థానంలో, పంత్ ఐదో స్ధానంలో ఆడాల్సి ఉందన్నాడు. సహచర ఆటగాడు ఆరోన్ ఫించ్ వివాహం సందర్బంగా తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆడలేదని, ఆ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చిన పంత్ విజయవంతమవడంతో అతన్నే కొనసాగించామని పాంటింగ్ పేర్కొన్నాడు. కానీ వాస్తవానికి ఆరంభ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ బదులు నాలుగో స్థానంలో ఆడింది విజయ్ శంకర్. ఆ మ్యాచ్‌లో అతడు 13 బంతుల్లో 13 పరుగులు చేసి అవుటయ్యాడు. పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణించాడు. -
రోహిత్‌శర్మ.. వరెస్ట్ ఫర్ఫార్మెన్స్!
ఐపీఎల్ 2018 లీగ్ దశ ముగిసిపోయింది. మంగళవారం నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. ప్లేఆఫ్స్ చేరాలనే గంపెడంతా ఆశతో ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడింది. కానీ ఇటు ముంబై, అటు పంజాబ్ ఓడిపోవడంతో ఆ రెండు జట్లు ఇంటిదారి పట్టాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఢిల్లీ జట్టు పోతూపోతూ.. ముంబై జట్టును కూడా ఇంటి దారిపట్టించింది. చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ముంబై 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక.. 11 పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ముంబై జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇక, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరు మరీ దారుణమని చెప్పాలి. రోహిత్ శర్మ ఇప్పటివరకు 11 ఐపీఎల్ సిరీస్‌లు ఆడగా.. అందులో పది సీజన్లలోనూ 300కుపైగా పరుగులు చేశాడు. తాజా పదకొండో సీజన్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్లో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. ఆదివారం వరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో 300 పరుగులకుపైగా చేసిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, సురేశ్ రైనా పేరిట రికార్డు ఉండేది. ఆదివారం మ్యాచ్‌లో కూడా రోహిత్ (13 పరుగులు మాత్రమే చేశాడు) అంతగా రాణించకపోవడంతో అతను 300 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. మరోవైపు చెన్నై తరఫున ఆడుతున్న రైనా.. ఇప్పటికే 300లకుపైగా పరుగులు చేశాడు. దీంతో మొత్తం 11 ఐపీఎల్ సీజన్లలోనూ 300 పరుగులకుపైగా చేసిన ఏకైక ఆటగాడిగా నిలువగా.. రోహిత్ ఆ రికార్డును అందుకోలేకపోయాడు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్లో 300 మార్కును అందుకోలేకపోయిన ఆటగాడిగా చెత్త రికార్డును కూడా రోహిత్ మూటగట్టుకున్నాడు. -
కోట్లాలో కోహ్లి, డివిలియర్స్‌ల ఊచకోత
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోగా.. ఈ ఓటమితో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి (70; 40 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(72నాటౌట్; 37బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లు) బౌలర్లపై ఊచకోత కోయడంతో ఢిల్లీ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. డేర్‌డెవిల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే ఓపెనర్లు పార్థీవ్ పటేల్(6), మొయిన్ అలీ(1) పెవిలియన్ చేరటంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో కోహ్లి- డివిలియర్స్ జోడి జట్టు గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకుంది. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కోహ్లి 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. మూడో వికెట్‌కు 118 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత కోహ్లి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ మన్దీప్ సింగ్(13), సర్ఫరాజ్ ఖాన్(11) నిరుత్సాహపరిచారు. అయినప్పటికి డివిలియర్స్ చివరిదాకా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించగా, హర్షల్ పటేల్, లామించే, మిశ్రా తలో వికెట్ సాధించారు. అంతకముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ యుజ్వేంద్ర చహల్ ఆరంభంలోనే ఢిలీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా(2), జాసన్ రాయ్(12) విఫలమవ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ శ్రెయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత రిషభ్ పంత్(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)ను మొయిన్ అలీ ఔట్ చేయడంతో 109 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. వెనువెంటనే శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమించటంతో ఢిల్లీ స్కోర్‌బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఢిలీ అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మ(46నాటౌట్; 19 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(21 నాటౌట్; 20 బంతుల్లో; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
రిషభ్ పంత్ ఖాతాలో మరో ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్-11లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మరో ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన పంత్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే సీజన్లో ఢిల్లీ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఈ స్టార్ బ్యాట్స్‌మన్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ మాజీ సారథి గౌతం గంభీర్ (2008లో 534పరుగులు) పేరిట ఉండగా, ఈ ఏడాది పంత్ ఆ రికార్డు బద్దలుకొట్టాడు. ఈ సీజన్లో 578 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పంత్ కొనసాగుతున్నాడు. ఇక గతంలో ఢిల్లీ తరుపున ఈ ఘనత సాధించిన వారి జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(2012లో 495 పరుగులు), ఏబీ డివిలియర్స్(2009లో 465పరుగులు), డికాక్ (2016లో 445 పరుగులు)లు ఉన్నారు. ఇది కూడా చదవండి: రిషబ్ రికార్డుల మోత -
తడబడి నిలబడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా స్ధానిక ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 182 పరుగుల లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ముందుంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ యుజ్వేంద్ర చహల్ ఆరంభంలోనే ఢిలీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా(2), జాసన్ రాయ్(12) విఫలమవ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ శ్రెయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత రిషభ్ పంత్(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు)ను మొయిన్ అలీ ఔట్ చేయడంతో 109 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. వెనువెంటనే శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమించటంతో ఢిల్లీ స్కోర్‌బోర్డ్ నెమ్మదించింది. చివర్లో ఢిలీ అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మ(46నాటౌట్; 19 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్ శంకర్(21 నాటౌట్; 20 బంతుల్లో; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ రెండు వికెట్లు సాధించగా, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. -
బెంచీకే పరిమితైన గంభీర్.. కొత్త కెప్టెన్ వివరణ!
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న గౌతం గంభీర్ శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను బెంచీకే పరిమితం కావడం అభిమానుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే, గంభీర్ తనంత తానుగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడకూడదనేది ఆయన సొంత నిర్ణయమేనని కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. 2008 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న గంభీర్ ఇప్పటివరకు 4217 పరుగులు చేశాడు. కానీ ఈసారి ఐపీఎల్ సీజన్ గంభీర్‌కు కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గంభీర్ కేవలం 96.59 స్ట్రైక్‌రేటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్ నాయకత్వంలో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో గెలుపొందింది. దీంతో కెప్టెన్సీ నుంచి వైదొలగిన గంభీర్.. జట్టు నాయకత్వ పగ్గాలను యువకుడు శ్రేయస్‌కు అప్పగించాడు. దీంతో ఈ సీజన్లో తనకు అందబోయే వేతనాన్ని సైతం వదులుకోవాలని గంభీర్ నిర్ణయించాడు. రూ. 2.80 కోట్లకు ఢిల్లీ జట్టు గంభీర్‌ను కొనుగోలు చేసింది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులతో తేడాతో ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి గంభీర్‌ను తొలగించాలని తాను అనుకోలేదని, కానీ, గంభీరే స్వయంగా ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారని శ్రేయస్ వివరించాడు. గత మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ ఇలా తుదిజట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమని, ఆయన పట్ల తనకు ఎంతో గౌరవముందని తెలిపాడు. బాగా ఆడడం లేనందుకే ఆయన మ్యాచ్‌కు దూరంగా ఉన్నారని, ఆయన తప్పుకోవడం వల్ల కలిన్ మున్రోను తీసుకోవడానికి వీలు కలిగిందని, ఓపెనర్‌గా మున్రో జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడని చెప్పాడు. -
రాజస్తాన్ రాయల్స్ బోణీ