రోహిత్‌ శర్మకూ తప్పలేదు.. | Rohit Sharma gets emoji kit punishment | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మకూ తప్పలేదు..

Published Fri, May 18 2018 6:31 PM | Last Updated on Fri, May 18 2018 6:54 PM

Rohit Sharma gets emoji kit punishment - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు క్రమశిక్షణను పాటించకపోతే  జంప్‌ సూట్ వేసుకుని దర్శనమివ్వడం చూశాం. ఇటీవల ఇషాన్‌ కిషన్‌, అంకుల్‌ రాయ్‌, రాహుల్‌ చాహర్‌ ఆ జట్టు ఆటగాళ్లు ఎమోజీ జంప్‌ సూట్ వేసుకుని విమానాశ్రయంలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జంప్‌ సూట్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధరించాడు.

రోహిత్‌ శర్మ జంప్‌ సూట్‌ వేసుకుని ఉన్న ఫొటోలను అతని భార్య రితిక, ముంబై ఇండియన్స్‌ యజమాన్యాలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. జిమ్‌ సెషన్‌కు హాజరు కాకపోయినా, కిట్‌ బ్యాగ్‌ మరిచిపోయినా, చెప్పిన సమయానికి రిపోర్టు చేయకపోయినా, డ్రెస్‌ కోడ్‌ నిబంధన ఉల్లంఘించినా ఫ్రాంఛైజీ యాజమాన్యం ఆదేశాల మేరకు ఈ జంప్‌ సూట్‌ ధరించాల్సిందే.

అయితే రోహిత్‌శర్మ ఎందుకు ఆ డ్రెస్‌ ధరించాడనేది తెలియలేదు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ జట్టు గురువారం దిల్లీ బయలుదేరింది. ఈ సమయంలో రోహిత్‌ ఈ డ్రెస్‌తో దర్శనమిచ్చాడు.

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడనుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై తప్పక గెలవాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement