ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్.. ఆర్చర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉనాద‍్కత్‌కు క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
దాంతో ఈ సీజన్‌లో రాజస్తాన్‌పై రెండోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గత నెలలో ఇరు జట్ల మధ్య జైపూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. కాగా, ఆ మ్యాచ్‌లో రోహిత్ రనౌట్ రూపంలో గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత ఈ నెల మొదట వారంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఆర్సీబీ పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతికి కీపర్ డీకాక్‌కు ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా ఔటైంది మాత్రం ఈ మూడు సందర్భాల్లోనే కావడం గమనార్హం.
కాగా, గతంలో రోహిత్ శర్మ డైమండ్ డకౌట్(బంతులేమీ ఆడకుండా ఔట్ కావడం)గా పెవిలియన్ చేరాడు. 2011లో కేకేఆర్‌తో వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ డైమండ్ డక్‌గా ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment