రోహిత్‌ శర్మ బాగా ఆడితేనే... | Rohit Sharma plays well | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ బాగా ఆడితేనే...

Published Sat, Apr 28 2018 3:28 AM | Last Updated on Sat, Apr 28 2018 6:13 PM

Rohit Sharma plays well  - Sakshi

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు గెలుస్తున్న తీరును వర్ణించేందుకు అత్యద్భుతం అనే ఒక్క పదమే సరైంది. ప్రత్యర్థి జట్టు చేయాల్సిన రన్‌రేట్‌ 7 పరుగులకంటే తక్కువగా ఉన్న రెండు మ్యాచ్‌లను కూడా ఆ జట్టు కాపాడుకోగలిగింది. దాదాపు అసాధ్యం లా అనిపించే ఇలాంటి ఆటను వరుసగా రెండు సార్లు ప్రదర్శించడం చూస్తే వారి బౌలింగ్‌ ఎంత బాగా ఉందో అర్థమవుతుంది. ఆ జట్టుకు వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌ మెంటార్‌గా ఉండటం ఎంతో మేలు చేస్తోంది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా బెంగళూరుతో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలగడం మరో విశేషం. ఆఖరి ఓవర్లలో అండర్సన్‌తో బౌలింగ్‌ చేయించిన కోహ్లి నిర్ణయం ఏ మాత్రం అర్థం కాలేదు. టైటిల్‌ నిలబెట్టుకోవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ తాము గెలవాల్సి ఉంటుందని ముంబై ఇండియన్స్‌కు బాగా తెలుసు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బాధ్యత తీసుకొని బాగా ఆడాలి. ఎందుకంటే అతను బాగా ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లోనే ముంబై గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement