
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఐపీఎల్-2020 టోర్నీలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీని ఓడించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్(66), వృద్ధిమాన్ సాహా(87) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లీగ్‌లో తమ రెండో అత్యధిక స్కోరును నమోదు చేసింది. మంగళవారం నాటి ఈ అపూర్వ విజయంతో హైదరాబాద్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. అంతేగాకుండా విక్టరీతో పాటు తమ కెప్టెన్ వార్నర్ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ డబుల్ ధమాకా కారణంగా డ్రెస్సింగ్‌రూంలో సందడి వాతావరణం నెలకొంది. (చదవండి: సాహా... వార్నర్... వహ్వా! )
ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘గత రాత్రి కీలక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌రూంలో ఏం జరిగిందో చూడండి. కేక్ ఫైట్‌ను కూడా అస్సలు మిస్పవకండి’’అంటూ ఆరెంజ్ కలర్‌లో ఉన్న హార్ట్ ఎమోజీని జతచేసింది. ఇక ప్రియంగార్గ్, మనీష్ పాండే సహా ఇతర ఆటగాళ్లు వార్నర్ ముఖాన్ని కేక్‌తో నింపేశారు. ఆ తర్వాత వార్నర్ అందరి మీదకు కేక్ విసురుతూ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వద్దకు పరుగెత్తుకువెళ్లి అతడి ముఖానికి కేక్ పూశాడు. మిగతా ఆటగాళ్లంతా ఈ సంతోష క్షణాలను సెల్‌ఫోన్‌లో బంధిస్తూ సందడి చేశారు. ఈ వీడియో ఆరెంజ్ ఆర్మీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. సమిష్టి వైఫల్యంతో ఢిల్లీ జట్టు భారీ ఓటమిని మూటగట్టుకుంది.(చదవండి: ధోని ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈవో గుడ్‌న్యూస్!)
Comments
Please login to add a commentAdd a comment