టీమిండియా వెటరన్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ని ఐపీఎల్-2021సీజన్‌కు గాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఉమేష్ యాదవ్ కేవలం బెంచ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో మెగా వేలంలోకి వెళ్లనున్నాడు. కాగా రానున్న మెగా వేలంలో అతడికోసం మూడు ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ అతడిని దక్కించుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు గత ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ, ఆర్సీబీ, కేకేఆర్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. 121 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఉమేష్ యాదవ్ 121 వికెట్లు పడగొట్టాడు. ఇక మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనున్నట్లు సమాచారం.
చదవండి: Ashes 2021: 13 సార్లు 200లోపూ.. 20 మంది ఆటగాళ్లు డకౌట్; ఇంగ్లండ్ చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment