ఓటమిపై స్పందించిన వార్నర్‌  | David Warner Post Heart Warming Messages for Sunrisers Loss   | Sakshi
Sakshi News home page

Published Mon, May 28 2018 3:02 PM | Last Updated on Mon, May 28 2018 3:04 PM

David Warner Post Heart Warming Messages for Sunrisers Loss   - Sakshi

డేవిడ్‌ వార్నర్‌ (ఫైల్‌ఫొటో)

ముంబై : చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి చెంది తృటిలో టైటిల్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరాజయంపై సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం ట్విటర్‌ వేదికగా తన సహచర ఆటగాడు షేన్‌ వాట్సన్‌ ప్రదర్శనను కొనియాడిన వార్నర్‌.. సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల పోరాటాన్ని ప్రశంసించాడు.

‘నా సహచర ఆటగాడు షేన్‌వాట్సన్‌ విజృంభణను చూడటం అద్బుతంగా ఉంది. ఫలితాన్ని పక్కన పెడితే.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరడం గొప్ప విషయం.’ అని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు అభిమానులు ముగ్దులయ్యారు. ఈ సీజన్‌లో నీవు లేవు వార్నర్‌.. వచ్చే సీజన్‌లో కప్‌ సన్‌రైజర్స్‌దేనని, ఫైనల్లో నీవిలువేంటో తెలిసిందని, నీవు ఉంటే కనీసం 200 లక్ష్యాన్నైనా నిర్ధేశించేవారని కామెంట్‌ చేస్తున్నారు. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌తో ఏడాది నిషేదం ఎదుర్కొంటున్న వార్నర్‌ను బీసీసీఐ ఐపీఎల్‌కు అనుమతించని విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్‌ వాట్సన్‌ అద్భుత సెంచరీతో సీఎస్‌కే టైటిల్‌ నెగ్గిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement