ఢిల్లీ క్యాపిటల్స్ (PC: IPL/DC)
IPL 2023- CSK Vs DC: ‘‘పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయాం. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోవడం మాకిది ఐదోసారో.. ఆరోసారో అనుకుంటా. ఈ మ్యాచ్‌లో మేము వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. దానికి తోడు రనౌట్. ఈ టార్గెట్ మేము ఛేజ్ చేయగలిగిందే.
ఆరంభంలోనే ప్రత్యర్థి జట్లపై కాస్త ఒత్తిడి పెంచడం సహా మాలో కనీసం ఒక్క బ్యాటర్ అయినా మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే పరిస్థితి వేరేలా ఉండేది’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విచారం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తమ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అందరూ తలా ఓ చెయ్యి వేసి
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా ఢిల్లీ బుధవారం సీఎస్‌కేతో తలపడింది. సొంత మైదానంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు మార్కు అందుకోకపోయినా.. అందరూ తలా ఓ చేయి వేయడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది.
ధోని హైలైట్
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని 9 బంతుల్లో 20 పరుగులు రాబట్టి తనదైన శైలిలో సీఎస్‌కే ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
వార్నర్ (PC: IPL)
ఆరంభంలోనే కోలుకోలేని షాక్
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీని చెన్నై పేసర్ దీపక్ చహర్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. వార్నర్‌ను డకౌట్ చేసిన చహర్.. ఫిలిప్ సాల్ట్‌ను 17 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మనీశ్ పాండే కారణంగా మిచెల్ మార్ష్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
దీంతో 3.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. ఏ దశలోనూ సీఎస్‌కే బౌలర్లపై ఒత్తిడి పెంచలేకపోయింది. ఫలితంగా 140 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది.
కనీసం స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేక
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ‘‘మిడిల్ ఓవర్లలో కనీసం స్ట్రైక్ కూడా రొటేట్ చేసుకోలేకపోయాం. చెత్త బంతులు వేసినపుడు వాటిని షాట్లుగా మలచడంలోనూ విఫలమయ్యాం.
నిజానికి ఇది మేము ఛేజ్ చేయగల స్కోరే అయినా వ్యూహాలు పక్కాగా అమలు చేయలేకపోయాం’’ అంటూ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. కాగా ఢిల్లీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలో గెలుపొంది 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
చదవండి: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని
IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా!
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్
క్రేజ్ మాములుగా లేదు.. యాడ్ వేయలేని పరిస్థితి!
Super show with the ball from @ChennaiIPL! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 10, 2023
The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌
Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4
Comments
Please login to add a commentAdd a comment