IPL 2022: SRH Pacer Umran Malik Sheer Pace to Nicholas Pooran in Practice Session Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: బౌన్సర్‌లతో భయపెట్టిన సన్‌రైజర్స్‌ బౌలర్‌.. పాపం పూరన్‌!

Published Thu, Mar 24 2022 2:33 PM | Last Updated on Thu, Mar 24 2022 4:59 PM

Umran Maliks Lethal bouncers Leave Nicholas Pooran Bamboozled in Practice - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు(PC: SRH)

ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున అరంగేట్రం చేసిన జమ్మూ యువ పేసర్‌ ఉమ్రాన్ మాలిక్‌ తనదైన ముద్ర వేసుకున్నాడు. గత సీజన్‌లో ఆ జట్టు బౌలర్‌ టి.నటరాజన్‌ కరోనా బారిన పడడంతో ఉమ్రాన్‌కు అవకాశం దక్కింది. దీంతో అతడికి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. గతేడాది కేవలం మూడు మ్యాచ్‌లే ఆడిన ఉమ్రాన్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

ఇది ఇలా ఉంటే ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు రూ. 4 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను రీటైన్‌ చేసుకుంది. ఇక ఐపీఎల్‌-2022 కు సమయం దగ్గర పడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్‌ తన బౌలింగ్‌తో ‘ప్రత్యర్ధి’ జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ నికోలస్ పూరన్‌ను తన బౌన్సర్‌లతో ఉమ్రాన్‌ ఇబ్బంది పెట్టాడు.

ఉమ్రాన్‌ వేసిన ఓ బౌన్సర్‌కు పూరన్‌ లెగ్‌సైడ్‌ ఈజీ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మార్చి 29న తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement