Ind Vs SA: Arshdeep Singh Wins NET BATTLE Against Umran Malik, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs SA: యార్కర్లతో అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్.. పాపం ఉమ్రాన్‌ మాలిక్‌..!

Published Tue, Jun 7 2022 12:16 PM | Last Updated on Tue, Jun 7 2022 1:55 PM

Arshdeep Singh wins NET BATTLE against Umran Malik - Sakshi

PC: BCCI/IPL

ఐపీఎల్‌ అదరగొట్టిన యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌,అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు  ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీ బీజీగా గడుపుతోంది. తొలి టీ20కు ముందు భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ సోమవారం ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించాడు. కాగా నెట్స్‌లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్ సింగ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

అయితే నెట్స్‌లో ఉమ్రాన్‌పై అర్ష్‌దీప్ పై చేయి సాధించాడు. అద్బుతమైన యార్కర్లతో అర్ష్‌దీప్ అదరగొట్టాడు. కాగా ఉమ్రాన్‌ నెట్స్‌లో రిషబ్ పంత్‌కు బౌలింగ్‌ చేశాడు. అయితే ఉమ్రాన్‌ బౌలింగ్‌లో ఒక్క బంతిని కూడా పంత్‌ విడిచి పెట్టలేదు. ఉమ్రాన్‌ చాలా ఎ‍క్కువ పేస్‌తో బౌలింగ్‌ చేయడం వల్ల పంత్‌ సులభంగా ఎదర్కొన్నాడు. ఇక వీరిద్దరుతో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అదే విధంగా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్‌ కార్తీక్‌ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
చదవండి: Ind Vs SA T20I Series: ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌.. ప్రాక్టీసులో తలమునకలైన టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement