PC: IPL.com
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ విజయంలో ఆ జట్టు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ముఖ్యంగా పంజాబ్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఉమ్రాన్ పరుగులేమి ఇవ్వకుండా మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని అతడు కొనియాడాడు. అఖరి ఓవర్‌లో మెయిడిన్ ఓవర్ చేసి వికెట్లు సాధించడం అరుదైన సందర్భమని చోప్రా అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో గంటకు 145 కి.మీ స్పీడ్‌పైగా మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, ఫెర్గూసన్, షమీ వంటి ఫాస్ట్ బౌలర్లతో మాలిక్ పోటీ పడుతున్నాడు. ఇక అఖరి ఓవర్‌లో మెయిడిన్‌తో పాటు మూడు వికెట్లు సాధించండం అరుదైన సందర్భం. గతంలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి టీమిండియా క్యాప్‌ను అందుకున్నట్లుగా, ఈ ప్రదర్శనతో ఉమ్రాన్ కూడా భారత్ తరపున అరంగేట్రం చేస్తాడాని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇటువంటి ఫాస్ట్ బౌలర్ అవసనమని నేను అనుకుంటున్నాను అని నిఖిల్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి భారత పేసర్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment