sun risers team
-
"అతడు అద్భుతమైన బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు"
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఆ జట్టు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పంజాబ్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన ఉమ్రాన్ పరుగులేమి ఇవ్వకుండా మూడు వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడని అతడు కొనియాడాడు. అఖరి ఓవర్లో మెయిడిన్ ఓవర్ చేసి వికెట్లు సాధించడం అరుదైన సందర్భమని చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో గంటకు 145 కి.మీ స్పీడ్పైగా మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా, ఫెర్గూసన్, షమీ వంటి ఫాస్ట్ బౌలర్లతో మాలిక్ పోటీ పడుతున్నాడు. ఇక అఖరి ఓవర్లో మెయిడిన్‌తో పాటు మూడు వికెట్లు సాధించండం అరుదైన సందర్భం. గతంలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి టీమిండియా క్యాప్‌ను అందుకున్నట్లుగా, ఈ ప్రదర్శనతో ఉమ్రాన్ కూడా భారత్ తరపున అరంగేట్రం చేస్తాడాని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇటువంటి ఫాస్ట్ బౌలర్ అవసనమని నేను అనుకుంటున్నాను అని నిఖిల్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. తొలి భారత పేసర్‌గా..! -
బై... బై... ఉప్పల్!
నగరంలో క్రికెట్ సందడి ముగిసింది. ఈ సీజన్‌కి భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్‌లు అయిపోయాయి. సన్‌రైజర్స్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడినా... ఆఖరి మ్యాచ్‌లో గెలవడం నగర అభిమానికి సంతృప్తిని మిగిల్చింది. ఓ వైపు ఎండ మండిపోతున్నా... మంగళవారం నాటి మ్యాచ్‌కూ అభిమానులు పోటెత్తారు. -
స్టెయిన్ దగ్గర నేర్చుకుంటున్నా
మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది భువనేశ్వర్ కుమార్ ఇంటర్వ్యూ న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ పెద్ద సంచలనం. సన్‌రైజర్స్ జట్టు విజయాల్లో తనదే కీలక పాత్ర. కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేయడంలో దిట్ట అయిన ఈ భారత బౌలర్ ఈసారి డెత్ ఓవర్లలోనూ రాణిస్తున్నాడు. తన బౌలింగ్ మెరుగుపరుచుకోవడానికి స్టెయిన్ సలహాలు తీసుకుంటున్నానని చెబుతున్న భువనేశ్వర్ ఇంటర్వ్యూ... ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనపై స్పందన? చాలా సంతోషంగా ఉంది. రాజస్థాన్‌పై విజయం మా జట్టులో ఆత్మవిశ్వాసం పెంచింది. ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మంచి ఆటతీరును ప్రదర్శించి పాయింట్ల పట్టికలో దూసుకెళ్తాం. చిన్న స్కోర్లను సన్‌రైజర్స్ ఎలా కాపాడుకుంటోంది? ఐపీఎల్లో ఏ జట్టుకూ లేని అత్యుత్తమ బౌలింగ్ లైనప్ మా సొంతం. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మొతేరా పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని మాకు అర్ధమైంది. బౌలర్లు రాణించడం వల్లే తక్కువ స్కోరైనా విజయం సాధించాం. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. డెత్ ఓవర్లలో చక్కగా బంతులు వేయడంలో స్టెయిన్ సహకారం ఉందా ? ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌తో కలిసి బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ వేయాలో చెబుతూ స్టెయిన్ తన అనుభవాన్ని పంచుకుంటాడు. తన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఇప్పటివరకు డెత్ ఓవర్లలో బంతుల్ని చక్కగా వేయగలుగుతున్నా. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో వికెట్లు తీయగలుగుతున్నా. ఏ వికెట్‌పైనైనా బంతి స్వింగ్ చేయగల సమర్థుడని మాజీ కెప్టెన్ శ్రీకాంత్ అన్నాడు. దీనిపై మీ స్పందన ? జ. స్వింగే నా బలం (నవ్వుతూ..). నేను బంతిని కావాల్సిన విధంగా స్వింగ్ చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. టి20 క్రికెట్లో వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యం. బ్యాట్స్‌మెన్‌ను ఎప్పుడు అవుట్ చేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటా. -
సన్‌రైజర్స్ కు ఇద్దరే
ముంబై: ఐపీఎల్-7 కోసం హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించుకుంది. ధావన్‌తో పాటు స్టెయిన్‌ను రైజర్స్ తమ వద్దే అట్టి పెట్టుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను కొనసాగించేందుకు ఆ టీమ్ రూ. 22 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్-2014 కోసం వచ్చే నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో వేలం జరగనుంది. చెన్నై, ముంబై జట్లు ఊహించిన విధంగానే కీలక ఆటగాళ్లను కొనసాగించాయి. ముంబై ఐదో ఆటగాడిగా దినేశ్ కార్తీక్‌తో పోటీ ఎదురైనా తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి రాయుడుకు అవకాశం దక్కింది. ఒక్క ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మాత్రం ఏ ఒక్క ఆటగాడినీ అట్టి పెట్టుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్ సహా ఎవరినీ కొనసాగించడానికి ఆ జట్టు ఇష్ట పడలేదు. గత సీజన్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్‌తో పాటు వోహ్రాను పంజాబ్ జట్టు కొనసాగించింది. గత సీజన్లో 12 మ్యాచుల్లో 161 పరుగులు చేసిన వోహ్రాను కొనసాగించడం అనూహ్యమే. కోల్‌కతా, రాజస్థాన్ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోలేదు. ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్లలో బిన్నీ, శామ్సన్, వోహ్రా భారత జట్టుకు ఆడలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఆటగాళ్ల కోసం గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో సభ్యుల సంఖ్య కనిష్టంగా 16, గరిష్టంగా 27 మంది మాత్రమే ఉండాలి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 9 మందికి మించకూడదు. ఆటగాళ్లను కొనసాగించుకునేందుకు ఖర్చయిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన డబ్బుతో ఫ్రాంఛైజీలు వేలానికి వెళతాయి. ఆటగాళ్లకు ఎంత? ఒక్క ఆటగాడిని కొనసాగిస్తే ఫ్రాంఛైజీ తమ వేలం మొత్తం నుంచి రూ.12.5 కోట్లు తగ్గించుకోవాలి. ఆ తర్వాత వరుసగా 9.5, 7.5, 5.5, 4 కోట్ల రూపాయల చొప్పున తర్వాతి ఆటగాళ్ల కోసం తగ్గించుకోవాలి. అయితే ఫ్రాంఛైజీ సదరు ఆటగాడికి ఇంతే మొత్తం చెల్లించాలని నిబంధన లేదు. జట్టుకు, ఆటగాడికి ఉన్న ఒప్పందం మేరకు ఎంత మొత్తమైనా చెల్లించొచ్చు. దీనితో ఐపీఎల్ కౌన్సిల్‌కు సంబంధం లేదు. ‘రైట్స్ టు మ్యాచ్’ కార్డ్ అంటే 2013 సీజన్లో తమకు ఆడిన ఆటగాడు వేలంలోకి వెళితే... వేలంలో అతడికి పలికిన ధరను ఇచ్చి పాత జట్టే తీసుకునే అవకాశం. ఉదాహరణకు... జాన్సన్‌ను ముంబై వేలంలోకి పంపించింది. వేలంలో జాన్సన్‌ను చెన్నై రూ. 5 కోట్లకు కొన్నది అనుకుందాం. అప్పుడు ముంబై అదే రూ.5 కోట్లు ఇచ్చి జాన్సన్‌ను తీసుకోవచ్చు. -
రైజర్స్‌కే శిఖర్!
కోల్‌కతాతోనే గంభీర్ న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు శిఖర్ ధావన్‌ను తమ వద్దే కొనసాగించుకోవాలని భావిస్తోంది. 2013 ఐపీఎల్లో జట్టుతో ఆలస్యంగా చేరినా ధావన్ చెలరేగి టీమ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతనితో పాటు డేల్ స్టెయిన్, అమిత్ మిశ్రా, తిసార పెరీరాలను కూడా రైజర్స్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌లోని వివిధ జట్లు తాము కొనసాగించే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 10లోగా బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది. గత సీజన్లో జట్టు విఫలమైనా కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ కెప్టెన్ గౌతం గంభీర్‌ను కొనసాగించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్‌తో పాటు సునీల్ నరైన్ కూడా కొనసాగే అవకాశం ఉంది. షకీబ్ అల్హసన్, మనోజ్ తివారీల విషయంలో డోలాయమానంలో ఉంది.