
PC: IPL.Com
ఐపీఎల్-2022లో భాగంగా మార్చి 29న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో నెట్స్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా.. ఉమ్రాన్ మాలిక్ యార్కర్ వేస్తే ఫ్రీ ఢిన్నర్ ఇప్పిస్తానని పూరన్ ఛాలెంజ్ చేశాడు.
"నీవు తరువాతి బంతిని యార్కర్ వేస్తే నీకు డిన్నర్ ఇప్పిస్తాను. ఒక వేళ నీవు యార్కర్ వేయకపోతే నీవు నాకు ఇప్పించాలి" అని పేర్కొన్నాడు. పూరన్ ఛాలెంజ్‌కు ఉమ్రాన్ మాలిక్ కూడా అంగీకరించాడు. అయితే దురదృష్టవశాత్తూ, ఉమ్రాన్ యార్కర్‌ను వేయలేకపోయాడు. దీంతో ఛాలెంజ్‌లో ఓడిపోయిన ఉమ్రాన్ మాలిక్.. పూరన్‌కు ఫ్రీ డిన్నర్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ రూ.4కోట్లకు రీటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కరిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో అబ్బోట్, రొమారియో అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ
చదవండి: IPL2022: విజయానందంలో ఉన్న పంత్ సేనకు సాడ్ న్యూస్
Did Umran buy you dinner as promised, @nicholas_47? 🤣#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/LvDlzFwUMc
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2022