Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్బుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో మూడుఔట్‌లు నమోదు కాగా.. అన్నింటిలో శాంసన్ పాత్ర ఉండడం విశేషం. ఇందులో రెండు రనౌట్లు ఉంటే ఒకటి క్యాచ్ ఔట్.
ఇక 29 పరుగులతో వేగంగా ఆడుతున్న నికోలస్ పూరన్‌ను సంజూ శాంసన్ ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ ఓవర్ ఐదో బంతిని కృనాల్ స్వింగ్ ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. అయితే క్విక్ సింగిల్ కోసం పూరన్ ముందుకు పరిగెత్తుకొచ్చాడు. కృనాల్ వద్దన్నా వినలేదు. ఇక కీపర్ శాంసన్ తన చేతిలోకి బంతి రావడమే ఆలస్యం.. డైరెక్ట్ త్రో వేశాడు.
బులెట్ కన్నా వేగంతో వచ్చిన బంతి పూరన్ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. రిప్లేలో పూరన్ రనౌట్ అని క్లియర్‌గా తెలుస్తోంది. పెవిలియన్ బాట పట్టిన పూరన్ తనను తాను తిట్టుకుంటూ వెళ్లడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Brilliant keeping by captain cool #SanjuSamson to get Pooran out. #RRvLSG #RajasthanRoyals pic.twitter.com/M8ofJci3YX
— Roshmi 💗 (@CricketwithRosh) April 19, 2023
What a run-out by Captain Sanju Samson - A brilliant direct hit and even Sanju didn't take off his gloves.
— CricketMAN2 (@ImTanujSingh) April 19, 2023
Captain Sanju leading by example! pic.twitter.com/xOLmTLRO5B
Comments
Please login to add a commentAdd a comment