![Rashid Khan Dedicates Man Of The Match To His Friends Son - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/13/Rashid-Khan.jpg.webp?itok=47RYa6re)
సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ 11లో భాగంగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ తేడాతో విజయం సాధించింది. అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ 13 పరుగులు మాత్ర మే ఇచ్చి ఒక వికెట్ తీయడం విశేషం.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వారు ఏ లీగ్‌లో ఆడినా మద్దతిస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ను ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడికి, అతడి కుమారుడికి అంకితం ఇస్తున్నాను. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నగదు ఇచ్చేస్తాను. అఫ్గాన్ క్రికెటర్లం నబీ, ముజీబ్, నేను శక్తివంచన లేకుండా జట్టు విజయాల కోసం పోరాటం చేస్తాం. ఎంతగానో ఇష్టపడే ఆటలో విజయం కోసం పోరాడటం మాకు ఎంతో ఆనందంగా ఉంటుందని’ వివరించాడు. రషీద్ మంచి క్రికెటరే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment