వీడియో వైరల్‌: రషీద్‌ ఖాన్‌.. స్మిత్‌ అయ్యాడు | Sunrisers Hyderabad Post Video Rashid Khan Imitates Smith | Sakshi
Sakshi News home page

అచ్చం అతడిలానే.. చూడముచ్చటగా

Published Fri, Apr 3 2020 4:47 PM | Last Updated on Fri, Apr 3 2020 4:47 PM

Sunrisers Hyderabad Post Video Rashid Khan Imitates Smith - Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో క్రికెట్‌ టోర్నీ, లీగ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూనే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ తన ఇంట్లోనే ఓ చిలిపి ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను అనుకరిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. ఫన్నీగా  ఉన్న ఆ వీడియోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

సన్‌రైజర్స్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై రాజస్తాన్‌ రాయల్స్‌ సైతం స్పందించింది. తమ సారథి స్మిత్‌ ఆ విధంగా ఒక్కసారే కాదని అనేకమార్లు ఆడాడని పేర్కొంటూ మరో వీడియోను పోస్ట్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగిన సంభాషణ, స్మిత్‌ను అనుకరిస్తూ రషీద్‌ చేసిన బ్యాటింగ్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘అచ్చం స్మిత్‌ లానే బ్యాటింగ్‌ చేస్తున్నావ్‌.. చూడముచ్చటగా ఉంది’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఇక తన సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించే రషీద్‌ వీలుచిక్కినప్పుడల్లా బ్యాట్‌తోనూ మెరుస్తాడు. ఐపీఎల్‌లో అనేక మ్యాచ్‌ల్లో బంతితో పాటు బ్యాట్‌తో కూడా సన్‌రైజర్స్‌కు అనేక విజయాలను అందించాడు.  

చదవండి:
యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్‌
ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement