వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..! | IPL 2021: Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar | Sakshi
Sakshi News home page

వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన కామెంట్స్‌

Published Mon, Oct 4 2021 6:53 PM | Last Updated on Mon, Oct 4 2021 6:53 PM

IPL 2021: Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar - Sakshi

Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar: సన్‌రైజర్స్‌ యాజమాన్యం డేవిడ్‌ వార్నర్‌ను పక్కకు పెట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడానికి ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వద్ద క్రికెటేతర కారణాలు ఉన్నాయని ఆరోపించాడు. వార్నర్‌పై వేటు వేయడానికి ఫామ్‌ లేమి ఒక్కటే కారణం కాదని.. ఒకవేళ అదే కారణంగా చూపడానికి ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వద్ద సరైన ఆధారాల్లేవని అన్నాడు. వార్నర్‌ పేలవమైన ఫామ్‌ చాలాకాలంగా కొనసాగలేదన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించిన ఆయన.. వేటుకు కారణాలు అంతుచిక్కడంలేదని అన్నాడు. కానీ​ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పుకొచ్చాడు.  

కాగా, సెప్టెంబర్‌ 27న రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వార్నర్‌ కనీసం డగౌట్‌లో కూడా కనిపించలేదు. హోటల్‌ రూమ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ మధ్యలో అతను ఇన్‌స్టా వేదికగా సంచలన మెసేజ్‌ను షేర్‌ చేశాడు. తాను ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున మరో మ్యాచ్‌ను ఆడలేనని, తన చివరి మ్యాచ్‌ను ఆడేశానని పెద్ద బాంబు పేల్చాడు. అయితే అనూహ్యంగా నిన్న కేకేఆర్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

ఇదిలా ఉంటే, 2013 సీజన్‌ నుంచి వరుసగా ప్రతి సీజన్‌లో 500 పరుగుల మార్కును క్రాస్‌ చేస్తూ వస్తున్న వార్నర్‌.. ప్రస్తుత సీజన్‌లో పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు.  2016లో సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఈ ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు.. ప్రస్తుత సీజన్‌ తొలి దశలో ఎస్‌ఆర్‌హెచ్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పించబడ్డాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ వార్నర్‌ పట్ల అమర్యాదగా వ్యవహరించి.. కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.  
చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. గేల్‌, కోహ్లి రికార్డులు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement