మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్ తుది అంకానికి చేరింది. మరికొద్ది రోజుల్లో లీగ్ దశ ముగించుకుని ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే మొహాలి వేదికగా ఐఎస్ బింద్రా స్టేడియంలో కింగ్స్ పంజాబ్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగబోయే లీగ్ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్.. ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారిన నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్, కేకేఆర్‌లు 12 మ్యాచ్‌ల చొప్పున ఆడి తలో ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచాయి. దాంతో ఇరు జట్లు చెరో పది పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి
అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించింది. ఇప్పటివరకూ మూడు ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాగా, ఇంకా ఒకటి మాత్రమే మిగిలి ఉంది. నాల్గో స్థానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు, కేకేఆర్, కింగ్స్ పంజాబ్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 12 పాయింట్లు సాధిస్తుంది. దాంతో సన్‌రైజర్స్‌తో సమంగా నిలుస్తుంది. అప్పుడు సన్‌రైజర్స్ మరో మ్యాచ్‌లో గెలిచి, తాజా మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా తన ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే రన్‌రేట్ ఆధారంగా ఒక జట్టు ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. అయితే ప్రస్తుత మ్యాచ్‌లో ఓడిన జట్టు తన రేసును లీగ్ దశలోనే ముగించకతప్పదు. ఈ తరుణంలో కింగ్స్ పంజాబ్-కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
తుదిజట్లు:
కేకేఆర్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), సునీల్ నరైన్, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, రసెల్, రింకూ సింగ్, పియూష్ చావ్లా, సందీప్ వారియర్, హ్యారీ గర్నీ
పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నిఖోలస్ పూరన్, స్యామ్ కరన్, మన్‌దీప్ సింగ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఆండ్రూ టై
Comments
Please login to add a commentAdd a comment