మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 184 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కింగ్స్ పంజాబ్ ఆటగాళ్లలో సామ్ కరన్(55 నాటౌట్; 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ప్రధానంగా గర్నీ వేసిన చివరి ఓవర్‌లో కరాన్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22 పరుగులు సాధించాడు. అంతకుముందు నికోలస్ పూరన్(48; 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సామ్ కరన్(47 నాటౌట్; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్(36; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మన్‌దీప్ సింగ్(25;17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్)లు సమయోచితంగా ఆడారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ ఆదిలోనే కేఎల్ రాహుల్(2), క్రిస్ గేల్(14) వికెట్లను చేజార్చుకుంది.
ఆ తరుణంలో మయాంక్ అగర్వాల్-పూరన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిదర్దూ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో కింగ్స్ పంజాబ్ స్కోరు గాడిలో పడింది. అయితే పూరన్ హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మన్‌దీప్ సింగ్-మయాంక్ అగర్వాల్‌లు బాధ్యతాయుతంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ ఫర్వాలేదనిపించింది. కాగా, సామ్ కరన్ చెలరేగి ఆడటంతో కింగ్స్ పంజాబ్ స్కోరు పరుగులు తీసింది. కనీసం 150 పరుగులు స్కోరు దాటడమే గగనం అనుకున్న తరుణంలో కరన్ విజృంభించడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సందీప్ వారియర్ రెండు వికెట్లు సాధించగా, గర్నీ, రసెల్, నితీశ్ రాణాలు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment