కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బుధవారం స్థానిక ఈడెన్ గార్డెన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ చేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతుంది. కానీ పంజాబ్ పలు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సామ్ కర్రన్ స్థానంలో హర్దుస్ విలోజెన్‌కు అవకాశం కల్పించింది. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. నికోలసన్ పూరన్‌ను తప్పించి డేవిడ్ మిల్లర్‌కు చోటు కల్పించారు. ఇక మన్కడింగ్ వివాదం తరువాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అందరి దృష్టి పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్‌పైనే ఉంది.
(చదవండి: ఎవరీ వరుణ్ చక్రవర్తి?)
ఇప్పటికే ఇరు జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేశాయి. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించగా.. రాజస్తాన్ రాయల్స్‌పై కింగ్స్ పంజాబ్ జయకేతం ఎగరేసింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ అద్భుతంగా రాణించారు. ఇక దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పలు కూడా రాణిస్తే కేకేఆర్‌కు ఎదురేఉండదు. కింగ్స్ పంజాబ్ విషయానికొస్తే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ గేల్ మరోసారి తన బ్యాట్‌కు పదునుపెట్టాలని పంజాబ్ జట్టు ఆశిస్తోంది. గేల్‌కు తోడుగా రాహుల్ కూడా రాణిస్తే పంజాబ్‌కు ఎదురేవుండదు. బౌలింగ్ విషయంలో ఇరుజట్లలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దీంతో లీగ్‌లో రెండో విజయమే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
తుది జట్లు
కేకేఆర్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, పీయుష్ చావ్లా, సునీల్ నరైన్, ప్రసీద్ కృష్ణ, ఫెర్గుసన్
కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై, వరుణ్ చక్రవర్తి, హర్దుస్ విలోజెన్, డేవిడ్ మిల్లర్
Comments
Please login to add a commentAdd a comment