కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో మరో వివాదం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్‌కి పాల్పడి అతి పెద్ద వివాదాన్ని సృష్టించాడు. మన్కడింగ్ క్రీడాస్పూర్తికి చాలా విరుద్ధమని కొందరు, కాదు అది నిబంధనల ప్రకారమే అంటూ మరికొందరు తమ వాదనలు వినిపించారు.ఇక బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
కింగ్స్ ఎలెవన్ ఆటగాళ్లు మయాంక్, సర్ఫరాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రసిద్ధ్ కృష్ట వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని మయాంక్ కవర్స్ మీదుగా షాట్ ఆడి సింగిల్ తీసుకున్నాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నితిశ్ బంతిని అందుకొని మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రస్సెల్‌పైపు సాధారణంగా విసిరాడు. కానీ లైట్ల తప్పిదం వల్లా.. రస్సెల్ ఆ బంతిని అందుకోకపోవడంతో అది బౌండరీవైపు పరుగులు పెట్టింది. దీంతో అంపైర్లు అది ఓవర్ త్రో బౌండరీగా ప్రకటించారు.
(ఇక్కడ చదవండి: కోల్‌కతా కుమ్మేసింది )
ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. రాబిన్ ఊతప్ప, కెప్టెన్ దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా అంపైర్లతో కాస్త గొడవపడ్డారు. అంపైర్లు వాళ్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు కింగ్స్ కెప్టెన్ అశ్విన్ కూడా డగౌట్ నుంచి బయటకి వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని అఫ్ ఫీల్డ్ అంపైర్‌ను అడిగి తెలుసుకున్నాడు. కానీ చివరికి అంపైర్లు మాత్రం వాళ్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో కోల్‌కతా అనవసరంగా కింగ్స్ ఐదు పరుగులు సమర్పించుకుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. డేవిడ్ మిల్లర్(59), మయాంక్ అగర్వాల్(58)లు మాత్రమే పోరాటం చేయడంతో పంజాబ్ జట్టు 190 పరుగులు చేసి పరాజయం చెందింది.
Comments
Please login to add a commentAdd a comment