
దుబాయ్: కింగ్స్ పంజాబ్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఫిట్ అయ్యాడు. ఫుడ్ పాయిజిన్ కారణంగా ఆడుతాడనుకున్న గేల్.. కొన్ని మ్యాచ్‌లకు అనూహ్యంగా దూరమయ్యాడు. అయితే గేల్ కోలుకున్నట్లు కింగ్స్ పంజాబ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దాంతో తదుపరి మ్యాచ్‌లో గేల్ ఆడటం దాదాపు ఖాయమైంది. సన్‌రైజర్స్ జరిగిన మ్యాచ్‌లో గేల్ ఆడతాడని అంతా భావించారు. కాగా, చివరి నిమిషంలో ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన గేల్ ఆ మ్యాచ్‌కు దూరం కావడంతో పాటు కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఆ రెండు మ్యాచ్‌లను కింగ్స్ పంజాబ్ కోల్పోయింది. (డిఫెన్స్ చెక్ చేయబోయి గోల్డెన్ డక్ అయ్యాడు..)
గురువారం ఆర్సీబీతో షార్జాలో జరగబోయే మ్యాచ్‌లో గేల్ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. షార్జాలో మ్యాచ్ కాబట్టి పించ్ హిట్టర్ గేల్‌ను ఆడించడానికి కింగ్స్ పంజాబ్ ఏమాత్రం వెనకాడదు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక రాబోవు మ్యాచ్‌ల్లో గేల్ మెరుపులు మనకు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కింగ్స్ పంజాబ్ రాతను గేల్ మారుస్తాడో లేదో చూడాలి. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఏడు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment