మొహాలీ: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్ రైనా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ జోడి 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా అనవసరపు షాట్‌ను ఆడి వికెట్‌ను సమర్పించుకున్నాడు.
మరొకవైపు డుప్లెసిస్ ఆది నుంచి కింగ్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్.. సామ్ కరాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇది డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈసారి ధోని(10 నాటౌట్) భారీ షాట్లు ఆడకపోవడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో కరాన్ మూడు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment