అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 224 టార్గెట్‌ను నిర్దేశించగా, రాజస్తాన్ 19.3 ఓవర్లలో దాన్ని ఛేదించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా అందులో రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. (ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్!)
ప్రస్తుతం కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకూ 12 పాయింట్లు సాధించింది కింగ్స్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో కింగ్స్ పంజాబ్ కూడా బరిలో నిలిచింది. ఇప్పుడు కింగ్స్ పంజాబ్ మరో విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. ఇక రాజస్తాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో(ఈ మ్యాచ్‌తో కలుపుకుని) భారీ విజయాలు సాధించాలి. అప్పుడే అవకాశం ఉంటుంది. మరొకవైపు మిగిలిన రెండు మ్యాచ్‌లో గెలిస్తే కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుతుంది. ఒక మ్యాచ్‌లో ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచినా రేసులో ఉంటుంది. కానీ మిగిలిన జట్ల ఫలితాలపై కింగ్స్ పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. కాగా, ఇక్కడ కేకేఆర్ కంటే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం. సన్‌రైజర్స్ రన్‌రేట్‌తో పోలిస్తే కింగ్స్ పంజాబ్ రన్‌రేట్ బాలేదు. ఈ రెండు జట్ల మధ్యే నాలుగో స్థానం కోసం అధికపోటీ ఉండవచ్చు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?)
ఇక ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(595-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398-కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(329-కింగ్స్ పంజాబ్), సంజూ శాంసన్(326-రాజస్తాన్), స్టీవ్ స్మిత్(276-రాజస్తాన్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో మహ్మద్ షమీ(20-కింగ్స్ పంజాబ్), జోఫ్రా ఆర్చర్(17-రాజస్తాన్), రవిబిష్నోయ్(12- కింగ్స్ పంజాబ్), శ్రేయస్ గోపాల్(9- రాజస్తాన్), మురుగన్ అశ్విన్(9-కింగ్స్ పంజాబ్)లు వరుసగా ఉన్నారు.
కింగ్స్ పంజాబ్
కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
రాజస్తాన్
స్టీవ్ స్మిత్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి
Comments
Please login to add a commentAdd a comment