మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్ పంజాబ్ జట్టు తమ బ్యాటింగ్స్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను ఎంపిక చేసింది. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్ కోచ్‌పై తర్జనభర్జన పడుతున్న కింగ్స్ పంజాబ్ ఎట్టకేలకు వసీం జాఫర్ వైపు మొగ్గుచూపింది. భారత క్రికెట్ చరిత్రలో 150 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన జాఫర్‌ను ఎంపిక చేయడానికి కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అత్యంత ఆసక్తి చూపాడు. దాంతో కింగ్స్ పంజాబ్ మేనేజ్‌మెంట్ జాఫర్ నియమాకాన్ని ఖరారు చేసింది. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో జాఫర్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. కాకపోతే భారత ఓపెనర్ జాఫర్ పెద్దగా సక్సెస్ కాలేదు.
తనను కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించడంపై జాఫర్ ఆనందం వ్యక్తవం చేశాడు. ఈ మేరకు అనిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘ అనిల్ కుంబ్లేకు థాంక్స్. నన్ను తీసుకోవడానికి కుంబ్లే ఒక కారణం. కుంబ్లే సారథ్యంలో భారత్‌కు మ్యాచ్‌లు ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. అతన్ని నుంచి నేను చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో కోచింగ్ సేవలు అందిస్తున్నా. ఇప్పుడు నాకు ఇది మంచి అవకాశం. నా అనుభవంతో కింగ్స్ పంజాబ్‌ను ముందుకు తీసుకెళతా’ అని జాఫర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment