మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఐఎస్ బింద్రా స్టేడియంలో కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలుపొందగా, రాజస్తాన్ రాయల్స్ ఏడు మ్యాచ్‌లకు గాను రెండింట మాత్రమే విజయం సాధించింది. రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించింది.
తాజా మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టులోకి డేవిడ్ మిల్లర్, అర్షదీప్ సింగ్, ముజీబ్‌లు వచ్చారు. ఇక రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి ఆస్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, ఇష్ సోథీలు రాగా.. లివింగ్ స్టోన్, స్టీవ్ స్మిత్, కృష్ణప్ప గౌతమ్‌లను తప్పించారు. గత మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమైన స్మిత్‌కు ఉద్వాసన తప్పలేదు. ఒకవైపు సొంత మైదానంలో మ్యాచ్ కావడంతో కింగ్స్ పంజాబ్ గెలుపుపై ధీమాగా ఉండగా, తమ విజయాల సంఖ్యను పెంచుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. రాజస్తాన్ తన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించగా, ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓటమి పాలైంది.
కింగ్స్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పురాన్, మురుగన్ అశ్విన్, ముజిబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
రాజస్తాన్
అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠీ, ఆస్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనాద‍్కత్, ధావల్ కులకర్ణి, ఇష్ సోథీ
Comments
Please login to add a commentAdd a comment