రాజస్తాన్‌ లక్ష్యం 183 | Rajasthan Royals Set Target of 183 Runs Against Kings Punjab | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ లక్ష్యం 183

Published Tue, Apr 16 2019 9:53 PM | Last Updated on Tue, Apr 16 2019 9:56 PM

Rajasthan Royals Set Target of 183 Runs Against Kings Punjab - Sakshi

మొహాలి: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 183 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌-క్రిస్‌ గేల్‌లు ఆరంభించారు. అయితే క్రిస్‌ గేల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాహుల్‌తో కలిసిన మయాంక్‌ అగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌(26; 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) భారీ షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ తరుణంలో రాహుల్‌-డేవిడ్‌ మిల్లర్‌లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది. వీరిద్దరూ 85 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క‍్రమంలోనే రాహుల్‌(52; 47 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్‌ చేరగా, నికోలస్‌ పురాన్‌(5) నిరాశపరిచాడు. ఇక డేవిడ్‌ మిల్లర్‌(40) మెరవగా, రవిచంద్రన్ అశ్విన్‌ ‌( 17 నాటౌట్‌; 4 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement