షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో కేకేఆర్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసి 164 సాధిస్తే, కింగ్స్ పంజాబ్ 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కేకేఆర్ 11మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించగా, కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌లకు ఐదు విజయాలు నమోదు చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. మరొకవైపు ఈ మ్యాచ్ గెలిచి మరో మెట్టు ఎక్కాలని కేకేఆర్ యోచిస్తోంది. ఏది ఏమైనా ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.
కాగా, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు కష్టాలు తప్పవని పిచ్ రిపోర్ట్‌ను బట్టి అర్థమవుతుంది. పిచ్ స్లోగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే టాస్ గెలిచిన రాహుల్ ముందుగా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు.ఇదే విషయాన్ని టాస్ వేసిన క్రమంలో రాహుల్ స్పష్టం చేశాడు. ఛేదించే క్రమంలో బోర్డుపై ఎంత స్కోరు ఉందో తెలిస్తే గేమ్ ప్లాన్ సక్రమంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నాడు. ఇదిలాఉంచితే, ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఎటువంటి మార్పులు లేకుండా గత మ్యాచ్‌లో జట్టునే కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్‌గా ఇరుజట్లు 26సార్లు ముఖాముఖి పోరులో తలపడితే కేకేఆర్ 18సార్లు విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 8మ్యాచ్‌ల్లో గెలిచింది. 2014లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన తుదిపోరులో కేకేఆర్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి దూసుకుపోతుండగా, కేకేఆర్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్(567-కింగ్స్ పంజాబ్), మయాంక్ అగర్వాల్(398- కింగ్స్ పంజాబ్), నికోలస్ పూరన్(327- కింగ్స్ పంజాబ్), శుబ్‌మన్ గిల్(321-కేకేఆర్), ఇయాన్ మోర్గాన్(295- కేకేఆర్)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇరుజట్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మహ్మద్ షమీ(17-కింగ్స్ పంజాబ్), వరుణ్ చక్రవర్తి(12-కేకేఆర్), రవి బిష్నోయ్(10-కింగ్స్ పంజాబ్)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.
రాహుల్ వర్సెస్ వరుణ్
ఈ మ్యాచ్‌లో రాహుల్-వరుణ్ చక్రవర్తిల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. రాహుల్ బ్యాటింగ్‌లో దుమ్ములేపుతుంటే, వరుణ్ బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్లు సాధించి కేకేఆర్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ 133.41 స్టైక్‌రేట్‌తో పాటు 63 యావరేజ్‌తో ఉండగా, వరుణ్ 7.05 ఎకానమీతో కొనసాగుతున్నాడు. దాంతో వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
కేకేఆర్
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గ్యూసన్, నాగర్‌కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
కింగ్స్ పంజాబ్
కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్‌దీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్నోయ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment