మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అరుదైన విన్యాసం నమోదు చేశాడు. ఏడాది వ్యవధిలో ఒకే రోజు ఒకే వేదికపై ఒకే రకమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్–12లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం (ఏప్రిల్ 8) జరిగిన లీగ్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.
మొహాలీలో ఏడాది క్రితంగా సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 8) ఐపీఎల్-11లో కూడా రాహుల్ ఇదే విన్యాసం చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడి, జట్టును గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 2015 సన్స్‌రైజర్స్‌పై) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బద్దలు గొట్టాడు. ఏడాది వ్యవధిలో ఒకే రోజున రాహుల్ కాకతాళీయంగా అర్ధ శతకం సాధించి విజయాల్లో ప్రధాన భూమిక పోషించడాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment