Bating
-
బ్యాటింగ్ కోచ్ ఎవరో?
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరు ఖరారైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇతర సహాయక సిబ్బందిపై పడింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బృం దం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎంపిక విషయంలో రవిశాస్త్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎంపిక కమిటీ తమదైన శైలిలో తగిన వ్యక్తులను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరం. ముందంజలో విక్రమ్ రాథోడ్ ... 2014 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ పనితీరు నిజానికి బాగుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్ అతని హయాంలో తమ ఆటతీరు మెరుగైందని, సాంకేతిక విషయాల్లో కూడా లోపాలు తీర్చిదిద్దారని బహిరంగంగానే చెప్పారు. అయినా సరే బంగర్ పదవి భద్రంగా లేదు. అనేక మంది దీని కోసం పోటీ పడుతున్నారు. కారణాలేమైనా రవిశాస్త్రి కూడా భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ల గురించి మాట్లాడినంత సానుకూలంగా బంగర్ గురించి చెప్పలేదు. దాంతో కొత్త వ్యక్తికి అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. హెడ్ కోచ్ పదవికి ప్రయత్నించి విఫలమైన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఈసారి బ్యాటింగ్ కోచ్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటు ప్రవీణ్ ఆమ్రే, అమోల్ మజుందార్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కొటక్, హృషికేశ్ కనిత్కర్, మిథున్ మన్హాస్ కూడా ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. రోడ్స్‌కు కష్టమే! బౌలింగ్ కోచ్ పదవి కోసం ప్రస్తుత కోచ్ భరత్ అరుణ్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, పారస్ మాంబ్రే, అమిత్ భండారి బరిలో ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మరోవైపు జాంటీ రోడ్స్‌లాంటి దిగ్గజం పోటీలో నిలిచినా ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భారత్ ఫీల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీధర్‌కు రవిశాస్త్రి అండదండలు ఉండటమే దీనికి కారణం. టీమిండియా ప్రస్తుత ప్రమాణాలు శ్రీధర్ ఘనతే కాబట్టి రోడ్స్ స్థాయి వ్యక్తి అయినా సరే అనవసరమనే భావన కనిపిస్తోంది. -
కేఎల్ రాహుల్... అరుదైన ఘనత
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అరుదైన విన్యాసం నమోదు చేశాడు. ఏడాది వ్యవధిలో ఒకే రోజు ఒకే వేదికపై ఒకే రకమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్–12లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం (ఏప్రిల్ 8) జరిగిన లీగ్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 53 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. మొహాలీలో ఏడాది క్రితంగా సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్ 8) ఐపీఎల్-11లో కూడా రాహుల్ ఇదే విన్యాసం చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడి, జట్టును గెలిపించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యూసఫ్ పఠాన్(15 బంతుల్లో 2015 సన్స్రైజర్స్పై) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బద్దలు గొట్టాడు. ఏడాది వ్యవధిలో ఒకే రోజున రాహుల్ కాకతాళీయంగా అర్ధ శతకం సాధించి విజయాల్లో ప్రధాన భూమిక పోషించడాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. -
పరుగులు పారిస్తున్న జిల్లా క్రికెటర్లు
ఏలూరు రూరల్ ః అంతరజిల్లా క్రికెట్ పోటీల్లో జిల్లా క్రికెటర్లు సత్తా చాటారి. జిల్లా జుట్టు కెప్టెన్ కెఎస్ఎన్ రాజు సెంచరీతో ఆకట్టుకున్నారు. కొద్దిరోజులుగా విజయనగరంలో అండర్–14 బాలుర అంతరజిల్లా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాజట్టు శ్రీకాకుళం జట్టుతో తలపడింది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో జిల్లాజట్టు కెప్టెన్ కెఎస్ఎన్ రాజు అజేయంగా 142 పరుగులు చేసి అందరి మన్ననలు అందుకున్నాడు. జాన్‌రిచార్డ్ 77 పరుగులతో అకట్టుకున్నాడు. వీరిద్దరూ మొదట ఇన్నింగ్స్‌లో సైతం 24, 35 పరుగులు చేశారు. శ్రీకాకుళం జట్టు సైతం జిల్లాజట్టుకు ధీటుగా రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోటీల్లో జిల్లా జట్టు బ్యాట్స్‌మెన్ రాణించడంపై అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు, సహాయ కార్యదర్శి ఎం వగేష్‌కుమార్, బిఎస్ మంగేష్, వి విద్యాప్రసాద్, జిల్లా శిక్షకులు జి సత్యనారాయణ, షకీర్ హుస్సేన్, రామప్రసాద్, కాశీవిశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. -
కాలితో బౌలింగ్...భుజంతో బ్యాటింగ్
కశ్మీర్: ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తారు. ఆ బ్యాట్‌ను అలాగే పట్టుకొని పరుగులు తీస్తారు. హుస్సేన్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. స్నానం చేసి బట్టలు వేసుకోవడం దగ్గరి నుంచి గడ్డం గీసుకోవడం, కాలేజీకెళ్లి చదువుకోవడం. కాలుతో పెన్ను రాయడం లాంటి పనులు తేలిగ్గా చేసుకుంటారు. హుస్సేన్ ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి కట్టెల కోత మిషన్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి. మిగిలిన చేతుల భాగాలను శస్త్ర చికిత్సలో తీసివేయాల్సి వచ్చింది. ట్రీట్మెంట్కు ఎంతో ఖర్చయింది. ఆ ఖర్చును భరించేందుకు ఆయన తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేయాల్సి వచ్చింది. భుజాల వరకు రెండు చేతులు లేకుండా మనుగడ సాగించడం హుస్సేన్‌కు మొదట్లో కష్టమైంది. చదువుకోవడానికి స్కూల్‌కు వెళితే ‘నీవు చదువుకు పనికి రావు’ అంటూ స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. అయినా అందరితోపాటు తాను చదవగలను, రాయగలనని అనతికాలంలోనే కాశ్మీర్‌కు చెందిన ఈ హుస్సేన్ నిరూపించి పాఠశాలలో చేరారు. ప్రస్తుతం కాశ్మీర్ పారా క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యారు. తన ఆట తీరుతో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. బలమైన సంకల్పం, ఎంతటి అకుంఠిత దీక్ష ఉంటే తప్పా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం మానవ స్ఫూర్తికే స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. -
బ్యాటింగ్ కనిపించట్లేదు
స్పిన్‌కు దాసోహం అంటున్న భారత బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ నెగ్గిన భారత్ జట్టుకు ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా దక్కాయి. ముఖ్యంగా పిచ్‌ను తమకు అనుకూలంగా తయారు చేయించుకోవడంపై మాజీలు మండిపడ్డారు. అయితే సిరీస్ విజయం, పిచ్‌పై చర్చతో మరో కీలక అంశంపై పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. అదే భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం. పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవు కాబట్టి బ్యాటింగ్ పెద్దగా కనిపించే అవకాశం ఉండదు అని అనుకోవచ్చు. అయితే ఈ సిరీస్‌ను పక్కన పెట్టి కాస్త లోతుగా పరిశీలిస్తే మన బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా స్పిన్‌ను ఎదుర్కొవడానికి కష్టాలు పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. సిరీస్ నెగ్గాలనే ఒకే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లు ప్రస్తుతం బాగా చర్చనీయాంశం అయ్యాయి. నిజానికి భారత్‌లో సిరీస్ అంటే ఏ జట్టైనా స్పిన్ పిచ్‌లు తప్పవని ముందుగానే నిశ్చయించుకుంటుంది. అయితే ఈ స్థాయిలో పిచ్‌లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. కేవలం మూడురోజుల్లోనే మ్యాచ్ ముగిసే స్థాయిలో పిచ్‌లు ఉండడంతో కొంతమంది మాజీలు మండిపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది మరో విషయం కూడా ఉంది. అదే మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం. వాళ్లే ఉంటే.. ఆ పిచ్‌లపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు కదా మనవాళ్లు ఎలా రాణిస్తారని సందేహం రావచ్చు. అయితే సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్ ఉంటే ఈ స్థాయిలో కుప్పకూలేవారా అనేది సునీల్ గవాస్కర్ ప్రశ్న. ప్రొటీస్ జట్టులో కూడా స్మిత్, కలిస్ ఉంటే వందలోపు ఆలౌట్ అయ్యేవారా అనేది కూడా ఆలోచించాల్సిందే. నిజానికి కాస్త సహనం ప్రదర్శిస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవచ్చు అని మూడో టెస్టులో ఆమ్లా, డుప్లెసిస్ నిరూపించారు. వారిద్దరే 50 ఓవర్లకు పైగా బంతులు ఆడడమే దానికి నిదర్శనం. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ధావన్, కోహ్లి, రహానే అవుటవడానికి బౌలర్ల కృషి కంటే వారి తొందరపాటు షాట్లే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. కాస్త మెరుగైన వాళ్లు ఉండుంటే.. సిరీస్‌లో భారత జట్టు నాలుగు సార్లు ఆలౌటైతే వాటిలో 28 వికెట్లు దక్షిణాఫ్రికా స్పిన్నర్లకే దక్కాయి. పైగా వారి స్పిన్నర్లు ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు కూడా కారు. సైమన్ హార్మర్ భారత పర్యటనకు ముందు 2 టెస్టులు మాత్రమే ఆడగా, ఇమ్రాన్ తాహిర్ జట్టులో చోటు కోల్పోయి ఏకంగా 9 నెలల తర్వాత పునరాగమనం చేశాడు. వారి స్పిన్నర్ల బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సగటు 18.39 మాత్రమే. (అంటే సగటున 18 పరుగులకు ఒక వికెట్ సమర్పించుకున్నారు). తాహిర్ 13.25 సగటుతో 12 వికెట్లు తీయగా, హర్మర్ 25.40 సగటుతో 10 వికెట్లు తీశాడు. వారిద్దరు పెద్దగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేయలేదు. ఒకవేళ యాసిర్ షా, హెరాత్ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ప్రత్యర్థి జట్టులో ఉండి ఉంటే సిరీస్‌ను మనం నెగ్గేవాళ్లమా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం కష్టమే. 2014 నుంచి ఇదే వరుస.. గత రెండేళ్లుగా మన బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌కు దాసోహం అయిన తీరును గమనిస్తే కాస్త విస్తుపోవాల్సిందే. స్పినర్ల బౌలింగ్‌లో అతి తక్కువ సగటు ఉన్న టాప్-8 జట్ల జాబితాలో మనం చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాం. 31.61 సగటుతో మనం ఉండగా, వెస్టిండీస్ (30.20), దక్షిణాఫ్రికా (27.01) మన కింది స్థానాల్లో ఉన్నాయి. (మన సిరీస్ లేకపోయింటే దక్షిణాఫ్రికా సగటు కూడా భారత్ కంటే మెరుగ్గానే ఉండేది) ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ కాలంలో భారత్ విదేశాల్లోనే ఎక్కువగా మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్పిన్‌కు అనుకూలించని పిచ్‌లపై కూడా మన బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లకే వికెట్లు సమర్పించుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీకి దాసోహమైన మన బ్యాట్స్‌మెన్ అతని బౌలింగ్‌లో సగటున 23 పరుగులకు ఒక వికెట్ ఇచ్చేశారు. అదే సిరీస్‌లో భారత స్పిన్నర్ల సగటు ఏకంగా 44.07. (అప్పటికి అశ్విన్ ఈ స్థాయి ఫామ్‌లో లేడు). మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌లో సైతం ఎక్కువ వికెట్లు తీసింది వారి స్పిన్నర్ నాథన్ లియోనే. ఆసియా దేశాల బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడడంలో సిద్ధహస్తులు. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కే అనుకూలిస్తాయి కాబట్టి బంతి టర్న్ అయినా సరే ఆడడంలో పెద్దగా ఇబ్బంది పడరు. అయితే గత రెండేళ్లలో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడినంతగా ఆసియా టాప్-4 జట్లలో ఏది పడలేదు. స్పిన్ బౌలింగ్‌లో పాకిస్తాన్ సగటు 47.10, బంగ్లాదేశ్ సగటు 37.92, శ్రీలంక సగటు 33.58గా ఉంది. విదేశాల్లో సమస్యలు.. మన దేశంలో సిరీస్ కాబట్టి స్పిన్‌ను నమ్ముకున్నారు. అందుకు తగ్గట్లుగానే అశ్విన్ 24 వికెట్లతో, జడేజా 16 వికెట్లతో, మిశ్రా 7 వికెట్లతో దుమ్ములేపారు. సిరీస్‌లో దక్షిణాఫ్రికావి మొత్తం 50 వికెట్లు పడితే 47 స్పిన్నర్లకే దక్కాయి. పిచ్‌పై చర్చ రాగానే స్పందించిన కోహ్లి మాట్లాడుతూ.. విదేశాల్లో వారికి అనుకూలమైన పిచ్లే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించాడు. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పేస్ ట్రాక్‌లు ఉంటాయని దానర్థం. మరీ అక్కడి వెళితే మన స్పిన్ ప్రభావం నామమాత్రమే. టెస్టుల్లో వికెట్లు తీస్తేనే గెలుస్తామని చెప్పే కోహ్లి ఆ పని చేసే పేస్ ఎవరనేది ప్రశ్నించుకోవాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాంత్, ఉమేశ్ యాదవ్, వరుణ్ అరోన్, భువనేశ్వర్ కుమార్లో ఎవరిపైనా నమ్మకం పెట్టుకునే పరిస్థితుల్లో జట్టు మేనేజ్మెంట్ లేదు. అలాంటి సమయాల్లో బ్యాట్స్‌మెన్‌నే నమ్ముకోవాలి. పుంజుకోవాల్సిన సమయమిదే... ఈ సిరీస్‌లో భారత జట్టు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసినవి 68 పరుగులు మాత్రమే. కోహ్లి తర్వాత అంతటి స్టార్ రహానే, రోహిత్ శర్మ, సాహా, ధానవ్ ఘోరంగా విఫలమయ్యారు. వీళ్లలో కోహ్లి, రహానే, రోహిత్ సాంకేతికత గురించి అందరికి తెలిసిందే. లోపమంతా సహనంగా ఆడకపోవడమే. 1990-2011 మధ్య దిగ్గజాలు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ ఆడే సమయంలో స్పిన్ బౌలింగ్‌లో మన సగటు 44.97 (ఆ సమయంలో మనదే అత్యధికం). వీళ్ల రిటైర్మెంట్ తర్వాతే అసలు సమస్య వచ్చింది. కనీసం నాలుగో టెస్టులోనైనా వారి దాన్ని అధిగమిస్తారని ఆశిద్దాం. దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత భారత్ మళ్లీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లోనే పర్యటిస్తుంది. ఇంతకుముందులా కాకుండా అక్కడి పిచ్‌లపై వారి స్పిన్నర్లను మన బ్యాట్స్‌మెన్ ఎదుర్కొవాలంటే నాలుగో టెస్టు మ్యాచే వారికి సరైన ప్రయోగశాల లాంటిది. అక్కడి ఫాస్ట్ట్రాక్లపై మన బౌలర్ల వైఫల్యాన్ని అధిగమించాలంటే ఉన్న ఏకైక మార్గం మన బలమైన బ్యాటింగ్‌లో రాణించడమేనని జట్టు గుర్తిస్తే మంచిది. -
చెలరేగిన సూర్య విక్రమాదిత్య
జింఖానా, న్యూస్‌లైన్: అవర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య విక్రమాదిత్య 6 వికెట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో అవ ర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య... పాషా బీడి జట్టు బ్యాటింగ్‌ను కట్టడి చేయడంతో పాషా జట్టు 104 పరుగుల వద్ద ఆలౌటైంది. పాషా బీడి జట్టు ఆటగాళ్లు ఫరాన్ (31), ముజ్తబా (30) మినహా తక్కినవారు రాణించలేక పోయారు. మరో మ్యాచ్‌లో జిందా సీసీ జట్టు బ్యాట్స్‌మెన్ ఫరాజ్ నవీద్ 159 , హుస్సేన్ 62, అజహర్ 57 పరుగులతో కదం తొక్కడంతో జట్టు 395 పరుగులు సాధించింది. హెచ్‌బీసీసీ జట్టు బౌలర్ ఒమర్ ఖాన్ 8 వికెట్లు తీసి చెలరేగినప్పటికీ జిందా జట్టు భారీ స్కోరును అడ్డుకోలేకపోయాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ కోల్ట్స్: 294 (నవదీప్ సింగ్ 130, అమిత్ యాదవ్ 38, భాస్కర్ 34; తక్విల్లా 6/92), పీ అండ్ టీతో మ్యాచ్ ఉస్మానియా: 404 (సిద్ధాంత్ 119, రామ్ ప్రసాద్ 76, సృజన్ 32, దినేష్ 31; శ్రీరామ్ 3/85), రాజు సీసీతో మ్యాచ్ సుల్తాన్ షాహీ: 386 (ప్రసాద్ 56, మహేష్ కుమార్ 60, సాయికుమార్ 65, యోగి 95; చంద్రకాంత్ 5/113), హైదరాబాద్ టైటాన్స్: 55/5.