ఖాజా ఇన్.. షాన్ మార్ష్ అవుట్ | Khawaja in, Shaun Marsh out of Australia's squad for Boxing Day | Sakshi
Sakshi News home page

ఖాజా ఇన్.. షాన్ మార్ష్ అవుట్

Published Fri, Dec 25 2015 5:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

Khawaja in, Shaun Marsh out of Australia's squad for Boxing Day

మెల్ బోర్న్: వెస్టిండీస్ తో  శనివారం ఇక్కడ ఆరంభం కానున్నరెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు) కు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖాజా  తిరిగి జట్టులోకి రాగా, షాన్ మార్ష్ కు విశ్రాంతి నిచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఖాజా గాయపడిన అనంతరం జట్టుకు దూరమయ్యాడు. ఆ సిరీస్ లో తొలి  రెండు టెస్టుల్లో వరుస సెంచరీలతో రాణించిన ఖాజా.. ఆ తరువాత గాయపడ్డాడు. అయితే అతను తిరిగి కోలుకోవడంతో వెస్టిండీస్ తో జరుగనున్న రెండో టెస్టులో స్థానం కల్పించారు.

 

ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో 182 పరుగులతో రాణించిన మార్ష్ కు విశ్రాంతినిచ్చారు. ఆ మ్యాచ్ లో మార్ష్-వోజస్ జోడి నాలుగో వికెట్ కు 449 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా  తొలి టెస్టులో ఘోరంగా విఫలం చెంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ కనీసం ఈ మ్యాచ్ లోనైనా పోరాడాలని భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో కూడా విండీస్ ను మట్టికరిపించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఆసీస్ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement