
అడిలైడ్: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 10 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. శతకంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశాడు మార్ష్. ఖవాజాతో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. హ్యాండ్స్‌కోంబ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగులు, స్టొయినిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 247/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment