India, New Zealand Cricket Players Play "Footvolley" as Rain Abandons 1st T20I
Sakshi News home page

IND Vs NZ: వర్షంతో మ్యాచ్‌ రద్దు.. వింత గేమ్‌ ఆడిన భారత్‌, కివీస్‌ ఆటగాళ్లు 

Published Fri, Nov 18 2022 3:05 PM | Last Updated on Fri, Nov 18 2022 3:22 PM

India-New Zealand Cricket Players Play Footvolley New Game Rain Abandon - Sakshi

న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య జరగాల్సిన తొలి టి20 వర్షార్పణమయింది. ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడం అభిమానులను నిరాశపరిచింది. కనీసం టాస్‌ వేసే పరిస్థితులు లేకపోవడం.. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ రద్దుకే మొగ్గుచూపారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 మౌంట్‌ మౌంగానుయ్‌ వేదికగా ఆదివారం(నవంబర్‌ 20న) జరగనుంది.

ఈ సంగతి పక్కనబెడితే.. వర్షంతో మ్యాచ్‌ రద్దు కావడంతో టీమిండియా, న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కలిసి ఒక కొత్త గేమ్‌ ఆడారు. ఫుట్‌వాలీ పేరుతో ఆడిన ఈ గేమ్‌లో ఏకకాలంలో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ ఆడడంతో ఫుట్‌వాలీ అని పేరు పెట్టారు. స్కై స్టేడియం లోపల ఉన్న ఇండోర్‌ స్టేడియంలో మధ్యలో కుర్చీలు పెట్టి ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు చహల్‌ సహా మరో ఇద్దరు ఆడగా.. అటు న్యూజిలాండ్‌వైపు కేన్‌ విలియమ్సన్‌ సహా మరో ఇద్దరు ఉన్నారు.

ఇక మధ్యలో సంజూ శాంసన్‌, ఇష్‌ సోదీలు వారి ఆటను గమనిస్తూ ఎంకరేజ్‌ చేశారు.వర్షంతో మ్యాచ్‌ రద్దు కావడంతో టీమిండియా, కివీస్‌ ఆటగాళ్లు వింత గేమ్‌ ఆడి అభిమానులను కనీసం ఇలాగైనా ఎంటర్‌టైన్‌ చేశారంటూ కొందరు కామెంట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ, బ్లాక్స్‌క్యాప్స్‌ తమ ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాయి.  

చదవండి: ఆగని వర్షం.. భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement