IPL 2022 RCB vs RR: Dhanashree Verma's Reaction When Takes Virat Kohli's Wicket - Sakshi
Sakshi News home page

IPL 2022: కోహ్లి రనౌట్‌.. చహల్‌ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్‌.. మరీ ఇంత సంతోషమా? వైరల్‌

Published Wed, Apr 6 2022 11:07 AM | Last Updated on Wed, Apr 6 2022 1:09 PM

IPL 2022 RCB Vs RR: Dhanashree Verma Reaction Chahal Takes RCB Wicket Viral - Sakshi

కోహ్లి రనౌట్‌.. చహల్‌ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్‌(PC: IPL/ Disney+hotstar)

అన్నదమ్ములైనా, ప్రాణ స్నేహితులైనా.. వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలో దిగారంటే ప్రత్యర్థులుగా మారిపోవాల్సిందే! తమ జట్టుకు న్యాయం చేసే క్రమంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా పోటీ పడాల్సిందే! ఆ సమయంలో ఎలాంటి సెంటిమెంట్లకు తావుండదు మరి!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే. తొమ్మిదో ఓవర్‌లో యజువేంద్ర చహల్‌ విల్లేకు బంతిని సంధించగా.. రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పాదరసంలా కదిలి బాల్‌ను చహల్‌ వైపునకు వేశాడు.

వెంటనే బంతిని అందుకున్న చహల్‌ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు.  కాగా గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్‌కు ఆ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లితో అనుబంధం ఉంది. ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో ఇద్దరూ ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. కోహ్లి సలహాలు, సూచనల మేరకు చహల్‌ తన ప్రణాళికలు అమలు చేసేవాడు. అయితే, మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్‌ చేసుకోలేదు.

ఈ క్రమంలో రాజస్తాన్‌ చహల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చహల్‌ అదరగొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. కోహ్లి రనౌట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లి రనౌట్‌, ఆ వెంటనే తర్వాతి బంతికే విల్లీ అవుటయ్యాడు.

ఈ క్రమంలో చహల్‌ భార్య ధనశ్రీ వర్మ సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి.. ‘‘అయ్యో.. చహల్‌ను రిటైన్‌ చేసుకోలేదని ఆర్సీబీపై అంతగా పగబట్టారా వదినమ్మా? కోహ్లి అవుట్‌ అయితే మరీ ఇంత ఆనందమా? లేదంటే ఆర్సీబీ వికెట్లు పడగొడుతున్నందుకా?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా చహల్‌ ఇటీవల మాట్లాడుతూ..వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్‌ చేసుకునేందుకు గానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు గానీ ఆసక్తి చూపలేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనశ్రీ సంబరాలు చూసి.. ‘‘చహల్‌ ఎంతగా బాధపడ్డాడో.. ఇప్పుడు ధనశ్రీ ఆనందం చూస్తే అర్థమవుతోంది. చహల్‌ను వదిలేసి ఆర్సీబీ తప్పుచేసింది’’ అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.

చదవండి: IPL 2022: ‘అత్యుత్తమ ఫినిషర్‌’.. కెరీర్‌ ముగిసిపోలేదని నాకు నేనే చెప్పుకొన్నా! ఇప్పుడిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement