
హెడ్‌కోచ్ సంజయ్ బంగర్‌తో కోహ్లి PC: IPL/BCCI)
IPL 2022 LSG Vs RCB: ఎలిమినేటర్ గండాన్ని అధిగమించి ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. సంతోషంతో ఆర్సీబీ ఆటగాళ్లు, సిబ్బంది ముఖం వెలిగిపోయింది. ఒకరినొకరు హత్తుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఇక ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హెడ్‌కోచ్ సంజయ్ బంగర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఇంకా రెండు అడుగులు.. రెండే అడుగులు మిగిలి ఉన్నాయి’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు.
కాగా స్టార్ ఆటగాళ్లు, భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. ఆఖరిసారిగా 2016లో ఫైనల్ చేరినా సన్‌రైజర్స్ చేతిలో భంగపడి చేదు అనుభవాన్ని మిగుల్చుకుంది. ఇక కోహ్లి సారథ్యంలోని బెంగళూరు గత రెండు సీజన్లుగా ప్లే ఆఫ్స్ చేరినా ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం నెగ్గలేక ఇంటిబాట పట్టింది.
తాజా సీజన్‌లో రజత్ పాటిదార్ అద్భుత శతకంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించి రాజస్తాన్ రాయల్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఇక తమ సంబరాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది లైకులు, షేర్లతో దూసుకుపోతూ వైరల్ అవుతోంది.
ఐపీఎల్-2022: ఎలిమినేటర్ మ్యాచ్
లక్నో వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు
టాస్: లక్నో
ఆర్సీబీ- 207/4 (20)
లక్నో- 193/6 (20)
విజేత: 14 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైయర్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రజత్ పాటిదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు- నాటౌట్)
చదవండి: IPL 2022 LSG Vs RCB: అతడొక అద్భుతం.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment