ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా! | Know About Yuzvendra Chahal Fiance Dhanashree Varma | Sakshi
Sakshi News home page

చహల్‌కి కాబోయే భార్య ధనశ్రీ ఎవరో తెలుసా!

Published Sat, Aug 8 2020 7:56 PM | Last Updated on Sat, Aug 8 2020 8:20 PM

Know About Yuzvendra Chahal Fiance Dhanashree Varma - Sakshi

ఈ ధనశ్రీ వర్మ ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు, చహల్‌ అభిమానులు గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈ ధనశ్రీ...

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. చహల్‌ కొంతకాలంగా ధనశ్రీ వర్మ అనే యువతిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తననే పెళ్లి చేసుకోబోతున్నానని, ఇవాళ (శనివారం) రోకా కార్యక్రమం కూడా జరిగినట్లు చహల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. రోకా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేస్తూ అవును ‘మేము ప్రేమించుకున్నాం’ అంటూ ట్వీట్‌ చేశాడు. అప్పటి నుంచి ఈ ధనశ్రీ వర్మ ఎవరా? అని తెలుసుకునేందుకు నెటిజన్లు, చహల్‌ అభిమానులు గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు. అయితే ఈ ధనశ్రీ.. ఓ డ్యాన్సర్‌, కొరియోగ్రఫర్‌. తన పేరు మీద సొంతంగా డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఉంది.
(చదవండి: టీమిండియా క్రికెటర్‌ చహల్‌ పెళ్లి ఆమెతోనే)

అతే విధంగా బాలీవుడ్‌ ట్రాక్స్ డ్యాన్సర్‌తో పాటు హిప్‌ హాప్‌లో శిక్షణ కూడా ఇస్తూ ఉంటుంది. అంతేకాదు తను ఫేమస్‌ యూట్యూబర్‌ కూడా. యుట్యూబ్‌లో తనకు 1.5 మిలియన్న్ల ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. కాగా ధనశ్రీ వర్మ జూలై 23 చహల్‌ పుట్టిన రోజు సంద్భంగా శుభకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ ‘భరత్‌’లోని ఓ స్లో మోషన్‌ సాంగ్‌కు చహల్‌ డ్యాన్స్‌ చేస్తున్నవీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. “డ్యాన్స్‌ టీచర్‌గా నేను మీ వికెట్‌ తీశానని చెప్పాలనుకుంటున్నాను @yuzi_chahal23 మీరు ఎప్పుడు సరదాగా ఉండే విద్యార్థి, అద్భుతమైన వ్యక్తి కూడా” అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసింది. దీనికి చహల్‌ ‘ధన్యవాదాలు’ అంటూ హర్ట్‌ ఎమోజీని జోడించి సమాధానం ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement