
చహల్- ధనశ్రీ పెళ్లినాటి ఫొటో (PC: Yuzvendra Chahal)
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్, అతడి సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. కొన్ని రోజుల క్రితం ధనశ్రీ వర్మ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో పార్టీకి హాజరైన నాటి నుంచి వీరి గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి.
చహల్ లేకుండానే పార్టీకి హాజరైన ధనశ్రీ వర్మ.. భారత జట్టు మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సూర్య దంపతులతో ఫొటో దిగింది. దీనిని సూర్య భార్య దేవిషా శెట్టి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రూమర్లు వ్యాపించాయి. అదే సమయంలో ధనశ్రీ తన ఇన్‌స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
(PC: Yuzvendra Chahal)
ఈ నేపథ్యంలో.. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేరిట నకిలీ అకౌంట్ల నుంచి వచ్చిన ట్వీట్ చహల్ అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ‘‘బ్రేకింగ్: క్రికెటర్ యజువేంద్ర చహల్ నటి ధనశ్రీ వర్మ పంజాబ్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు’’ అంటూ మూడు అకౌంట్ల నుంచి ట్వీట్ షేర్ అయింది.
దీంతో చహల్- ధనశ్రీ పేర్లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయింది. ఈ విషయాన్ని గమనించిన ఏఎన్‌ఐ వెంటనే రంగంలోకి దిగింది. ఆ మూడు ఫేక్ అకౌంట్లు అంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఏఎన్‌ఐ పేరును వాడుతూ ఈ మూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు.
ఇలాంటి వార్త అసలు ఎక్కడా రాలేదు’’ అని అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఇది చూసిన చహల్ అభిమానులు ఫేక్ రాయుళ్లను ఏకిపారేస్తున్నారు. ‘‘మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.. పచ్చని జంట కాపురంలో నిప్పులు పోసేలా ఆ వార్తలు ఏంటి? మీకు బుద్ధిరాదా? సిగ్గు పడండి’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఆసియా కప్-2022 ఆడే భారత జట్టుకు ఎంపికైన యజువేంద్ర చహల్.. మెగా ఈవెంట్‌లో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక ధనశ్రీని ప్రేమించిన చహల్ 2020 డిసెంబరులో ఆమెను వివాహమాడిన విషయం తెలిసిందే. సన్నిహితుల నడుమ అత్యంత వైభవోపేతంగా వీరి పెళ్లి జరిగింది.
స్పందించిన చహల్..
తమ గురించి వస్తున్న రూమర్లపై యజువేంద్ర చహల్ స్పందించాడు. తమ బంధం గురించి పుట్టుకొస్తున్న ఇలాంటి పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఇలాంటి వదంతులకు ముగింపు పలకాలంటూ గాసిప్ రాయుళ్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశాడు.
చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్‌తో చహల్ భార్య ఫొటో! ఇన్‌స్టాలో ఇంటిపేరు తొలగించిన ధనశ్రీ.. హాట్‌టాపిక్‌గా..
IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్
Please note: All three are fake accounts impersonating ANI. No such news has been flashed. pic.twitter.com/rIRwhzneit
— ANI (@ANI) August 18, 2022
Comments
Please login to add a commentAdd a comment