India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు.
కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను కాదని.. ఆల్‌రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు.
చహల్‌కు నో ఛాన్స్
కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్‌లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు.
ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా!
అదే విధంగా.. ‘‘బ్యాటింగ్‌లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్‌రౌండర్‌ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.
టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు.
లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
అగార్కర్ రీజన్ ఇదీ
కాగా చహల్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు.
చదవండి: ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..
WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్..
Comments
Please login to add a commentAdd a comment