ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ (డివిజన్ 2)లో భారత లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్ సత్తా చాటాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో నార్తాంప్టన్ జట్టుకు ఆడుతున్న అతడు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అతను 9 వికెట్లతో చెలరేగడం విశేషం. చహల్ అద్భుత ప్రదర్శన కారణంగా మూడు రోజుల మ్యాచ్‌లో నార్తాంప్టన్ 9 వికెట్ల తేడాతో లీసెస్టర్‌షైర్‌ను చిత్తు చేసింది.
చహల్ @9
కాగా రెండో ఇన్నింగ్స్‌లో లీసెస్టర్ 316 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో చహల్ 5 వికెట్ల పడగొట్టి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు... తొలి ఇన్నింగ్స్‌లో అతడు 4 వికెట్లతో మెరిశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన నార్తాంప్టన్ ముందు.. లీసెస్టర్‌షైర్ 137 పరుగుల లక్ష్యం విధించింది.
ఈ క్రమంలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి నార్తాంప్టన్ ఈ స్కోరును ఛేదించింది. ఇదిలా ఉంటే.. గత మ్యాచ్‌లో విఫలమైన మరో భారత ఆటగాడు పృథ్వీ షాకు ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ తుది జట్టులో చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ గడ్డపై చహల్ జోరు
అంతకు ముందు డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చహల్ తొమ్మిది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన చహల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా... ఇంగ్లండ్ వన్డే కప్‌లోనూ చహల్ తనదైన ముద్ర వేశాడు. నార్తంప్టన్‌షైర్ తరఫున ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
జట్టును వీడిన చహల్
నార్తాంప్టన్ తరఫున నాలుగు కౌంటీ మ్యాచ్‌లు ఆడిన చహల్ మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 18 వికెట్లు ఆఖరి రెండు మ్యాచ్‌లలో తీయడం విశేషం. తదుపరి అతడు బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
చదవండి: IND VS BAN 1st Test: తప్పు చేసిన విరాట్ కోహ్లి
100 | Five for Yuzi Chahal! 5️⃣
Scott Currie's magnificent innings ends on 120 as he feathers behind to McManus.
Leicestershire 303/9, leading by 123.
Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/OM8MMYY0O3— Northamptonshire CCC (@NorthantsCCC) September 19, 2024
Comments
Please login to add a commentAdd a comment